/rtv/media/media_files/2025/07/10/hiv-2025-07-10-20-01-01.jpg)
UN says if US funding for HIV programs is not replaced, millions more will die by 2029
HIVని అరికట్టేందుకు అమెరికా చాలా దేశాల్లో ఎన్నో సహాయక కార్యక్రమాలు చేస్తోంది. గత 3 దశాబ్దాలుగా నిధుల పంపిణీ సాగుతోంది. దీనివల్ల HIV బారినపడి మరణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. కానీ ఈ సాయాన్ని ఇటీవల ట్రంప్ ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో హెచ్‌ఐవీ నిధులు పునరుద్ధరించకపోతే 2029 నాటికి 40 లక్షల ఎయిడ్స్ సంబంధిత మరణాలు, మరో 60 లక్షల హెచ్‌ఐవీ కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని ఐరాస ఎయిడ్స్ విభాగం హెచ్చరికలు జారీ చేసింది.
Also Read: ఆ ఒక్కచోటే 14,542 మంది మహిళల్లో క్యాన్సర్ లక్షణాలు
'' అమెరికా HIV నిధులు గత ఆరు నెలలుగా నిలివేసింది. ఇది షాక్‌కు గురిచేస్తోంది. ఇప్పటికే సరఫరా చైన్ అస్థిరంగా మారింది. ఆరోగ్య కేంద్రాలు మూసివేశారు. అలాగే వేలాది క్లినిక్‌లు సిబ్బంది లేకుండా ఖాళీగా ఉన్నాయి. చాలా సంస్థలు HIV నియంత్రణ కార్యక్రమాలు ఆపేశాయని'' ఐరాస ఎయిడ్స్ విభాగం తెలిపింది. అలాగే దేశాల మధ్య యుద్ధాలు, భౌగోళికంగా రాజకీయ పరిస్థితులు, వాతావరణ మార్పులు కూడా ఈ ప్రమాదాన్ని మరింత పెంచేలా ఉన్నాయని విచారం వ్యక్తం చేసింది.
Also Read: ఛీ.. మీరేం మనుషులురా.. ఆరేళ్ల చిన్నారితో 45ఏళ్ల వ్యక్తి ఏం చేశారంటే..?
ఇదిలాఉండగా పేదరికాన్ని నిర్మూలించడం, వ్యాధులను నివారించడం, మానవతా సాయం చేయాలనే లక్ష్యంతో USAID ఫండ్ ఏర్పాటయ్యింది. అమెరికా ప్రభుత్వం నిర్వహించే ఈ అతిపెద్ద మానవతా అభివృద్ధి పనుల విభాగంలో చాలామంది పనిచేస్తున్నారు. 160కి పైగా దేశాల్లో అమెరికా ఏడాదికి రూ.3.8 లక్షల కోట్లను ఖర్చు చేస్తోంది. 2025లో HIV నియంత్రణ కార్యక్రమాల కోసమే ఏకంగా రూ.34 వేల కోట్లు ప్రతిపాదనలు చేసింది. కానీ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక ఈ సాయం నిలిచిపోయింది. ఫెడరల్ గ్రాంట్లు, రుణాలను నిలిపివేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకోవడంతో అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు షాకైపోయాయి.