/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఆదివారం జరిగిన భీకర ఎన్కౌంటర్(encounter) లో ఇద్దరు పాకిస్థానీ ఉగ్రవాదులు హతమయ్యారు. చత్రూ అడవిలో నక్కిన ఉగ్రవాదులను తుదముట్టించేందుకు ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, CRPF జాయింట్‌గా చేసిన 'ఆపరేషన్ ట్రాషి-I'(Operation Trashi-I) సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. శాంతి భద్రతల దృష్ట్యా పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసి, నిఘా పెంచారు. - (jammu kashmir terror attack)
Also Read : ఆఫ్ఘనిస్తాన్పై పాక్ వైమానిక దాడులు.. పదుల సంఖ్యలో పౌరుల మృతి
#BREAKING: Two Top Terrorist Commanders of Pakistani terror group Jaish e Muhammad killed in Chatroo, Kishtwar of Jammu & Kashmir, India. Big success for Indian Army and J&K Police. pic.twitter.com/izCPcPkc65
— Aditya Raj Kaul (@AdityaRajKaul) February 22, 2026
ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు కిష్త్వార్లోని చత్రూ బెల్ట్‌లోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు బలగాలకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన సైన్యం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో భద్రతా బలగాలు గాలింపు చేపడుతుండగా, ఒక మట్టి ఇల్లులో నక్కిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు.
Also Read : విజయ్ దళపతి సంచలన నిర్ణయం.. ఎన్నికల్లో పోటీ అక్కడి నుంచే!
మోస్ట్ వాంటెడ్ కమాండర్ హతం?
ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు(terrorists) అక్కడికక్కడే మరణించారు. వీరిలో ఒకరు జైషే మహమ్మద్ సంస్థకు చెందిన మోస్ట్ వాంటెడ్ కమాండర్ సైఫుల్లా అయి ఉండవచ్చని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. సైఫుల్లా గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో భద్రతా బలగాలపై దాడులకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఘటనా స్థలం నుండి రెండు AK-47 రైఫిల్స్, భారీగా పేలుడు పదార్థాలు, యుద్ధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
కిష్త్వార్ అటవీ ప్రాంతంలో గత కొన్ని వారాలుగా ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి 18న జరిగిన ఎన్కౌంటర్లో ఒక పారా కమాండో వీరమరణం పొందగా, ఎనిమిది మంది సైనికులు గాయపడ్డారు. నాటి నుండి కొనసాగుతున్న 'ఆపరేషన్ ట్రాషి-I' లో భాగంగా, మంచు కురుస్తున్నప్పటికీ, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల్లో బలగాలు తమ గాలింపును ముమ్మరం చేశాయి. తాజా విజయంతో స్థానికంగా ఉగ్రవాద నెట్‌వర్క్‌కు గట్టి దెబ్బ తగిలినట్లయింది.
Follow Us