BIG BREAKING: సూపర్‌ మార్కెట్‌లో భారీ  పేలుడు.. 23 మంది మృతి

మెక్సికో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం హెర్మోజిల్లోలోని వాల్డో సూపర్ మార్కెట్ లో  పేలుడు సంభవించి 23 మంది ప్రాణాలు కోల్పోయారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

New Update
Fire Accident

Fire Accident

BIG BREAKING: మెక్సికో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం హెర్మోజిల్లోలోని వాల్డో సూపర్ మార్కెట్ లో భారీ పేలుడు సంభవించింది.  దీనిపై  వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో 23 మంది మృతి చెందగా.. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.   పండగ పూట ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం అక్కడి ప్రజలను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది.  అయితే  ప్రతి ఏడాది నవంబర్ 1న  అక్కడి ప్రజలు మరణించిన తమ ప్రియమైన వారిని గుర్తుచేసుకుంటూ  'డే ఆఫ్ ది డెడ్' అనే రంగుల పండుగను జరుపుకుంటారు. ఈ సంతోష సమయంలోనే  ఈ విషాదకర ఘటన జరిగింది. ప్రమాదంలో మరణించిన వారి కోసం  కుటుంబ సభ్యులు  కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

దర్యాప్తు చేపట్టిన పోలీసులు 

 ఈ ఘటన పై ఆ రాష్ట్ర గవర్నర్ అల్ఫోన్సో దురాజో స్పందిస్తూ.. తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాల పై దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.  అగ్ని ప్రమాదానికి గల కారణాల గురించి ఇంకా స్పష్టంగా తెలియరలేదు. గవర్నర్ ఆదేశాలతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే కొన్ని మీడియా కథనాల ప్రకారం.. ఎలక్ట్రికల్ ఫేల్యూర్ కారణంగా మంటలు సంభవించినట్లు తెలుస్తోంది. 

Also Read: Vikarabad Murder: వికారాబాద్ లో దారుణం..కుటుంబాన్ని కడతేర్చిన కసాయి..ఆ తర్వాత ఏం చేశాడంటే

Advertisment
తాజా కథనాలు