TN: బాధితులను కలుస్తా, అనుమతివ్వండి..డీజీపీకి లేఖ రాసిన విజయ్

టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్...తమిళనాడు డీజీపీకి లేఖ రాశారు. కరూర్ ర్యాలీ బాధితులను కలిసేందుకు అనుమతి ఇవ్వాంటూ అందులో విజ్ఞప్తి చేశారు. కరూర్ రోడ్ షోలో 41 మంది మృతి చెందారు.

New Update
tvk vijay

tvk vijay

తమిళనాడులోని కరూర్ లో సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన రోడ్ షో లో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 41 మంది చనిపోయారు. చాలా మంది తీవ్ర గాయాలపాలయ్యరు. మృతి చెందిన వారిలో మహిళలతో పాటు చిన్నారులు ఉన్నారు. విజయ్ సభకు ఊహించిన దాని కంటే ఎక్కువ మంది రావడం వల్లనే ఈ తొక్కిసలాట జరిగిందని అధికారులు చెబుతున్నారు.  పదివేల మంది పట్టే చోట లక్ష మంది జనం వచ్చారని...దీని కారణంగానే తొక్కిసలాట జరిగిందని అధికారులు ధృవీకరించారు. అయితే  పరిస్థితి గమనించిన విజయ్ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి వారికి నీళ్ల బాటిళ్లను అందించారు. చాలా మంది స్పృహ తప్పి పడిపోయారు. భారీ సమూహంలో అంబులెన్సులు అక్కడకు చేరుకోవడం ఇబ్బందిగా మారడంతో మృతుల సంఖ్య పెరిగింది. మరణించిన వారిలో పార్టీ కార్యకర్తలతో పాటూ ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు.

తొక్కిసలాట, తోపులాట చాలా తీవ్రంగా జరిగినట్లుగా వైద్య నివేదికలు చెబుతున్నాయి. పెద్ద ఎత్తున తొక్కిసలాట జరగడం వల్లే మరణాలు పెరిగాయని వైద్యులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. తమిళనాడు వైద్యవిద్య, పరిశోధన విభాగ డైరెక్టర్‌ ఆర్‌.సుగంధి రాజకుమారి నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక బృందం ప్రమాదం జరిగిన కరూర్‌ను సందర్శించింది. మృతులు, చికిత్స పొందుతున్న రోగులకు అందిన వైద్యం, వారి పరిస్థితి దగ్గరుండి గమనించింది. ఇందులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. చాలామంది కంప్రెస్సివ్‌ అస్ఫిక్సియాతో ఇబ్బందిపడి చనిపోయారని వైద్యులు బృందానికి తెలిపారు. అంటే తొక్కిసలాట, తోపులాట తీవ్రంగా జరిగిందని ఫలితంగా ఛాతీభాగం బలంగా ఒత్తిడికి గురవడంతో ఊపిరితిత్తులు సంకోచ, వ్యాకోచాలకు కష్టమైందని వివరించారు.ఊపిరితిత్తులపై ఒత్తిడి కారణంగా గాలి లోపలికి ప్రవేశించలేకపోయింది. మెదడుకు ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోయింది.ఇలాంటి పరిస్థితుల్లో ఎంతటి క్లిష్టపరిస్థితుల్లోనైనా 2, 3 నిమిషాలకు మించి బతికే అవకాశం లేదని..దీని వలన తొక్కిసలాట ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని వైద్యులు వివరించారు.

దయచేసి నన్ను కలవనివ్వండి..

కరూర్ తొక్కిలాట జరిగి దాదాపు పది రోజులపైనే అయింది. పరిస్థితులు కాస్త కుదుటపడ్డాయి. దీంతో ఇప్పుడు బాధితులను కలిసే అవకాశం తనకు ఇవ్వాలని టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ అడిగారు. బాధిత కుటుంబాలను తాను పరామర్శించాలనుకుంటున్నాంటూ తమిళనాడు డీజీపీకి ఆయన లేఖ రాశారు. అంతకు ముందు విజయ్ బాధిత కుటుంబాలతో ఫోన్ లో వీడియో కాల్ లో మాట్లాడారని తెలుస్తోంది. తమతో మాట్లాడిన విజయ్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారని..ఈ నష్టం పూడ్చలేనిదని అన్నారని తొక్కిసలాటలో భార్య, కూతురిని పోగొట్టుకున్న శక్తివేల్ తెలిపారు. త్వరలోనే మమ్మల్ని కలుస్తానని చెప్పారన్నారు. విజయ్ దాదాపు రెండు నిమిషాలు మాట్లాడారు.. వ్యక్తిగతంగా నేను కలుస్తాను అన్నారు... ఏవైనా అవసరాలు ఉంటే పార్టీ కార్యకర్తలు ద్వారా తెలియజేయాలని నాకు చెప్పారు అని శక్తివేల్  తెలిపారు.    

Also Read: Russia-Ukraine War: ఉక్రెయిన్ దళాల చేతిలో..రష్యా సైన్యంలోని భారతీయుడు..నిర్థారిస్తామన్న విదేశాంగ శాఖ

Advertisment
తాజా కథనాలు