అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కుట్ర కోణం?: టర్కీ సంచలన ప్రకటన!

ప్రమాదానికి గురైన బోయింగ్‌ 787- 8 విమానం నిర్వహణ టర్కీ దేశానికి చెందిన సంస్థ చేయలేదని స్పష్టత ఇచ్చింది. ఎయిర్ ఇండియా, తుర్కిష్‌ టెక్నిక్‌ మధ్య 2024-25కి గాను ఒప్పందంలో B777 విమానానికి మాత్రమే మెయింటెనెన్స్‌ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది.

New Update
Turkey clarifies Air India

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదానికి సంబంధించి టర్కీ ప్రభుత్వం కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. ప్రమాదానికి గురైన బోయింగ్‌ 787- 8 విమానం నిర్వహణ టర్కీ దేశానికి చెందిన సంస్థ చూసిందని వస్తున్న వార్తలను ఆ దేశం ఖండించింది. ఎయిర్ ఇండియా, తుర్కిష్‌ టెక్నిక్‌ మధ్య 2024-25కి గాను ఒప్పందం జరిగిందని పేర్కొంది. అందులో B777 విమానానికి మాత్రమే మెయింటెనెన్స్‌ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది.

బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ ప్రస్తావన లేదని స్పష్టం చేసింది. ఈ రకం విమానానికి నిర్వహణ చేయలేదని టర్కీ తెలిపింది. విమాన ప్రమాదంలో టర్కీ ప్రస్తవన రావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పాకిస్తాన్‌, భారత్‌ మధ్య యుద్ధవాతావరణ నెలకొంది. ఆ సమయంలో టర్కీ పాకిస్తాన్‌కు ఆయుధాలు సరఫరా చేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు