Trump Vs Modi: భారత్‌కు దూరమై తప్పు చేశా.. ట్రంప్ సంచలన పోస్ట్!

అగ్రదేశం అమెరికాకు భారత్ దూరం కావడం బాధాకరమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియాతోపాటు రష్యాను కూడా కోల్పోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. SCO సమావేశం అనంతరం మోదీ, జిన్పింగ్, పుతిన్ ఉన్న ఫొటోను ఆయన పోస్ట్‌ చేశారు.

New Update
Trump

Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్-అమెరికా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశానికి భారత్ దూరం కావడం బాధాకరమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియాతోపాటు రష్యాను కూడా కోల్పోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. చైనాలోని టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లతో సమావేశమైన తర్వాత ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ట్రూత్ సోషల్'లో ట్రంప్ ఒక పోస్ట్ చేస్తూ, "భారత్, రష్యా రెండు దేశాలు కుట్ర బుద్ధి ఉన్న చైనాకు దగ్గరయ్యాయి. మూడు దేశాల స్నేహం చాలాకాలం కొనసాగవచ్చు' అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, "వారందరికీ సుదీర్ఘమైన, సంపన్నమైన భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను" అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మోదీ, పుతిన్, జిన్‌పింగ్‌లు కలిసి ఉన్న ఫోటోను కూడా ఆయన పోస్ట్ చేశారు.

ఈ మూడు దేశాలు ఒక్కటి కావడానికి ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై విధించిన అధిక సుంకాలు, అలాగే రష్యా నుండి చమురు కొనుగోళ్లపై ఆయన చేసిన విమర్శలు ఇందుకు ప్రధాన కారణాలుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారత్ ఉక్రెయిన్‌ యుద్ధానికి పరోక్షంగా నిధులు సమకూరుస్తోందని ట్రంప్ ఆరోపించారు.

కాగా, భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ట్రంప్ వ్యాఖ్యలను తిరస్కరించారు. అమెరికా చైనా, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలపై ఇలాంటి ఆరోపణలు చేయలేదని, భారత్ తన జాతీయ ప్రయోజనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. అయితే, ట్రంప్ తాజా వ్యాఖ్యలు భారత్, అమెరికాల మధ్య వాణిజ్య మరియు వ్యూహాత్మక ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. భారత్ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగించడంలో దృఢంగా ఉంది.

#trump #47th us president donald trump #india #russia #china #america #latest-telugu-news
Advertisment
తాజా కథనాలు