/rtv/media/media_files/2025/01/28/OyiDNRzJrRrdqUQzPbq1.jpg)
mp secretrate
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. సోమవారం అర్థరాత్రి సీఎం కార్యదర్శి సహా 42 మంది ఐఏఎస్ అధికారులను రాష్ట్ర సర్కార్ ట్రాన్స్ ఫర్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి సచివాలయంలో రెండోసారి భారీ స్థాయిలో మార్పులు చోటు చేసుకున్నాయి.
ముఖ్యమంత్రి కార్యదర్శి భరత్ యాదవ్ స్థానంలో ఆహార పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీబీ చక్రవర్తిని కేంద్రం నియమించింది. దీంతో పాటు ఆయనకు అర్బన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్‌మెంట్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా, సీఎం కార్యదర్శిగా పని చేసిన భరత్ యాదవ్ మధ్యప్రదేశ్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా నియమించడం జరిగింది.
Also Read: Crime News: నా భార్య కొడుతుంది.. నన్ను క్షమించు నాన్న: భార్య వేధింపులకు మరో భర్త బలి!
అవినాష్ లావానియాను జబల్‌పూర్‌లోని పవర్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్‌కి ఎండీగా నియమించబడ్డారు. ఈ జాబితాలో రాష్ట్రంలోని 12 జిల్లాల కలెక్టర్లతో పాటు ముగ్గురు మహిళా అధికారులు కూడా ఉన్నారు.