Mallikarjun Kharge: 'గంగా నదిలో మునిగితే పేదరికం పోతుందా, మోదీ, అమిత్‌ నరకానికే పోతారు': మల్లికార్జున ఖర్గే

గంగా నదిలో మునిగితే దేశంలో పేదరికం తొలగిపోతుందా, ఆకలితో ఉన్నవారి కడుపులు నిండుతాయా అని మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. మోదీ, అమిత్‌ షా క్షమించరాని పాపాలు చేశారని, వీళ్లు నరకానికి వెళ్తారంటూ విమర్శించారు.

author-image
By B Aravind
New Update
MalliKarjun Kharge

MalliKarjun Kharge

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ లక్షలాది మంది అక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పలువురు బీజేపీ నేతలు కూడా పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్రంగా విమర్శలు చేశారు. గంగా నదిలో మునిగితే దేశంలో పేదరికం తొలగిపోతుందా ? ఆకలితో ఉన్నవారి కడుపులు నిండుతాయా? అని ప్రశ్నించారు. కుంభమేళాలో స్నానాలు చేస్తే విముక్తి రాదన్నారు. మోదీ, అమిత్‌ షా క్షమించరాని పాపాలు చేశారని, వీళ్లు నరకానికి వెళ్తారంటూ విమర్శించారు.       

Also Read: మెఘా కంపెనీని బ్యాన్ చేయాలి.. బీఆర్ఎస్‌ నేతల డిమాండ్

సోమవారం మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లో జరిగిన 'జై బాపు, జై భీమ్, జై సంవిధన్' సభలో మల్లికార్జున్ ఖర్గే ప్రసంగించారు. '' నేను ఎవరి విశ్వాసాలను ప్రశ్నించాలని అనుకోవడం లేదు. ఎవరైనా తప్పుగా భావిస్తే క్షమాపణలు కోరుతున్నాను. ఒక పిల్లవాడు ఆకలితో చనిపోతున్నప్పుడు, స్కూల్‌కు వెళ్లనప్పుడు, కార్మికులకు బకాయిలు రానప్పుడు ఇలాంటి సమయాల్లో వారు (బీజేపీ నేతలు) గంగా నదిలో మునిగేందుకు పోటీ పడుతున్నారు. ఫొటోల్లో బాగా కనిపించే వరకే స్నానాలు జరుగుతాయి. 

ఇలాంటి వారు దేశానికి మేలు చేయలేరు. దేవుడిపై మాకు కూడా నమ్మకం ఉంది. ప్రతీరోజు ప్రజలు వారి ఇళ్లల్లో పూజలు చేస్తారు. ఎలాంటి సమస్య లేదు. మతం పేరుతో పేదలు దోపిడికి గురవుతున్నారనేదే మా ప్రధాన సమస్య. గంగా నదిలో మునిగితే దేశంలో పేదరికం తొలగిపోతుందా ? ఆకలితో ఉన్నవారి కడుపులు నిండుతాయా?. కుంభమేళాలో స్నానాలు చేస్తే విముక్తి రాదు. మోదీ, అమిత్‌ షా క్షమించరాని పాపాలు చేశారని, వీళ్లు నరకానికి వెళ్తారు. చంద్రబాబు, నితీష్ చేతుల్లోనే మోదీ సర్కార్ మనుగడ సాగిస్తోందని మల్లికార్జున ఖర్గే విమర్శించారు. 

Also Read: ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ అమల్లోకి.. కొత్త రూల్స్ ఇవే

మరోవైపు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా స్పందించారు. కోట్లాదిమంది హిందువుల విశ్వాసంపై కాంగ్రెస్ పార్టీ ద్వేషంతో దాడులు చేస్తోందని ఆరోపించారు. ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇతర మతాల విశ్వాసం గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అంటూ ప్రశ్నించారు. 

Advertisment
తాజా కథనాలు