/rtv/media/media_files/2025/03/10/m8D5Ijh5DJ9ZifwTCrwi.jpg)
AP Annadata Sukhibhava Scheme
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ (ఆగస్టు 2) అన్నదాత సుఖీభవ పథకం కింద తొలి విడత నిధులను రిలీజ్ చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ స్కీం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 46.85 లక్షల మంది రైతుల అకౌంట్‌లో డబ్బులు జమ అయ్యాయి.
Annadata sukhibhava Status Check
తొలి విడతగా ఒక్కో రైతుకు రూ.7,000 చొప్పున (కేంద్రం పీఎం కిసాన్ వాటా రూ.2,000, రాష్ట్రం వాటా రూ.5,000) డబ్బులు వారి బ్యాంక్ ఖాతాల్లో నేరుగా పడ్డాయి. అయితే కొన్ని జిల్లాల్లో స్థానిక ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో.. ఆయా ప్రాంతాల్లోని రైతులకు డబ్బులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత వారి అకౌంట్‌లో నేరుగా డబ్బులు జమ చేయనున్నారు.
PAYMENT STATUS CHECK -https://annadathasukhibhava.ap.gov.in/know-your-status
Andhra Pradesh debuts Annadata Sukhibhava scheme today
— Mission Andhra (@MissionAndhra) August 2, 2025
• First instalment of ₹7,000 credited to 46.85 lakh eligible farmers; ₹5,000 from AP and ₹2,000 via PM‑Kisan at East Veerapalaem, Prakasam
• CM Naidu called the launch a festival, urging all officials to ensure no farmer… pic.twitter.com/Hsazp1Vkzs
ఇదిలా ఉంటే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం.. రైతులకు ఆర్థిక భరోసా కల్పించడం ద్వారా వ్యవసాయ రంగాన్ని మరింత ప్రోత్సహించాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే రైతులు తమ పంటలకు అవసరమైన విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు, ఇతర వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేయడం కోసం ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయం అందిస్తుంది.
దీని ద్వారా రైతులు రుణాల మీద ఆధారపడకుండా వ్యవసాయం చేయగలిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని ప్రోత్సహించి ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయి. ఆర్థిక సాయం ద్వారా రైతులపై ఉన్న రుణ భారాన్ని ప్రభుత్వాలు తగ్గిస్తున్నాయి.
పథకం ప్రయోజనాలు
అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి మొత్తం రూ.20వేల ఆర్థిక సాయం ఇవ్వనున్నారు. వీటిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన PM KISAN స్కీం ద్వారా రూ.6,000, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన Annadata sukhibhava పథకం కింద రూ.14,000 విడతల వారీగా జమ చేయనున్నారు.. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే.. భూమి లేని కౌలు రైతులు కూడా ఈ పథకం కింద లబ్ధి పొందవచ్చు. ఈ నిధులను 3 విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా వేస్తారు.
తొలి విడత కింద రూ.7,000
(PM KISAN నుంచి రూ.2,000 + Annadata sukhibhava నుంచి రూ.5,000)
రెండవ విడత కింద రూ.7,000
(PM KISAN నుంచి రూ.2,000 + Annadata sukhibhava నుంచి రూ.5,000)
మూడవ విడత కింద రూ.6,000
(PM KISAN నుంచి రూ.2,000 + Annadata sukhibhava నుంచి రూ.4,000)