OpenAI Chatgpt: డాక్టర్లనే మరిపించిన చాట్‌జీపీటీ.. నెలల తరబడి బాధపడుతున్న సమస్యకు పరిష్కారం

కొన్ని నెలల నుంచి బాధపడుతున్న సమస్యకు చాట్‌జీపీటీ పరిష్కారం చూపించిందని సోషల్ మీడియా వేదికగా ఓ యువతి పోస్ట్ చేసింది. తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న తన ఆరోగ్యానికి ప్రమాదమని డాక్టర్లు చెప్పగా చాటీ‌జీపీటీ మాత్రం పరిష్కారం చూపించింది.

New Update
OpenAI Chatgpt

OpenAI Chatgpt

అడ్వాన్స్‌డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో అనే దానికి ఈ వార్త నిదర్శనం. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి అనుభవం ఉన్న డాక్టర్లు కనిపెట్టలేని సమస్యను ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీ ఈజీగా గుర్తించింది. చనిపోతుందని డాక్టర్లు చెప్పగా.. చాట్‌జీపీటీ మాత్రం ప్రాణం పోసింది. వివరాల్లోకి వెళ్తే.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా వర్క్ చేస్తున్న శ్రేయ అనే యువతి సోషల్ మీడియా ద్వారా ఓ పోస్ట్ చేసింది. ఆమె తల్లి దాదాపు 18 నెలల నుంచి విపరీతమై దగ్గుతో బాధపడుతుంది. దీని కోసం ఎందరో డాక్టర్లను కలిసినా ఫలితం లేకపోయింది.

ఇది కూడా చూడండి:Mumbai train blasts case: ముంబై రైలు పేలుళ్ల ఘటన.. 12 మంది నిర్దోషుల తీర్పుపై సుప్రీంకోర్టు స్టే

ఇది కూడా చూడండి:Hari Hara Veeramallu:  హరిహర వీర మల్లుకు చంద్రబాబు అభినందనలు..ఎన్నాళ్లనుంచో అంటూ...

ప్రాణాలకే ప్రమాదమని..

ఆయుర్వేదం, హోమియోపతి, అల్లోపతి వంటి అన్ని రకాల చికిత్సలను కూడా ఉపయోగించారు. కానీ ఆరోగ్యం మాత్రం కుదట పడలేదు. ఇలానే ఇంకో ఆరు నెలల పాటు జరిగితే మాత్రం ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు తెలిపారు. దీంతో శ్రేయ తన తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన చెందింది. ఈ సమయంలో శ్రేయ ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీని ఆశ్రయించింది. తన తల్లికి ఉన్న అనారోగ్య సమస్యకి సంబంధించిన అన్ని లక్షణాలు, డాక్లర్లు చేసిన టెస్ట్ వివరాలను కూడా చాట్‌జీపీటీలో ఇన్‌పుట్ చేసింది. 

ఇది కూడా చూడండి:11 ఏళ్ల బాలికపై అత్యాచారం, 53 ఏళ్ల నిందితుడు జువైనల్‌ బోర్డుకు తరలింపు..

చాట్‌జీపీటీ తన తల్లి తీసుకుంటున్న రక్తపోటు (బీపీ) మందుల వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ వల్ల దగ్గు వస్తుందని తెలిపింది. శ్రేయ వాటిని పరిశీలించగా అదే నిజం అయ్యింది. చాట్ జీపీటీ చెప్పిన దీన్ని శ్రేయ వెంటనే తన తల్లిని తీసుకుని డాక్టర్ దగ్గరకు వెళ్లింది. డాక్టర్ వాటిని పరిశీలించి వెంటనే సమస్యకు సంబంధించిన మందులు ఇచ్చారు. ప్రస్తుతం ఆమె తల్లి ఆరోగ్యంగా నిలకడగా ఉందని, చాట్‌జీపీటీ తన తల్లి ప్రాణాలను కోల్పోయిందని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. 

#Chat GPT #health-issue #OpenAI Chatgpt
Advertisment
తాజా కథనాలు