/rtv/media/media_files/2025/02/01/pdvGATSmEh6NmbjpD2zH.jpg)
central bank of india released Recruitment of Credit Officer posts
ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(CBI).. డిగ్రీ చేసిన వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది. రెగ్యులర్ ప్రాతిపదికన క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 1000 పోస్టులను భర్తీ చేయనుంది. సరైన అర్హతలు, ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టులకు ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే..
మొత్తం ఖాళీల సంఖ్య: 1000
క్రెడిట్ ఆఫీసర్- మెయిన్ స్ట్రీమ్ (జనరల్ బ్యాంకింగ్) పోస్టులు
కేటగిరీల వారీగా ఖాళీలు
ఎస్సీ- 150 పోస్టులు
ఎస్టీ- 75 పోస్టులు
ఓబీసీ- 270 పోస్టులు
ఈడబ్ల్యూఎస్- 100 పోస్టులు
జనరల్- 405 పోస్టులు.
అసిస్టెంట్ మేనేజ్‌మెంట్ గ్రేడ్/ స్కేల్-1 (JMGS 1)
Also Read: Karthikeya 3: 'కార్తికేయ-3' పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్ చందూ మొండేటి..!
విద్యార్హత: ఆసక్తిగల అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుంచి 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. (SC/ ST/ OBC/PWBD 55 శాతం) ఉత్తీర్ణత లేదా తత్సమానం అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ/ గుంటూరు, విశాఖపట్నం. అలాగే తెలంగాణలో హైదరాబాద్, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
పే స్కేల్: నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు ఇస్తారు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.01.2025
దరఖాస్తుకు చివరి తేదీ: 20.02.2025.