Census: జనగణన ఈ ఏడాది ఉంటుందా ? లేదా ?

2025-2026 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో జనగణన, జాతీయ జనాభా పట్టి (NPR) కోసం రూ.574.80 కోట్లు మాత్రమే కేటాయించారు. దీంతో ఈ ఏడాది కూడా జనగణన జరగకపోవచ్చనే ప్రచారం నడుస్తోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Indian Population

Indian Population

భారత్‌లో జనాభా లెక్కల కార్యక్రమం మరింత ఆలస్యం కానుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎందుకంటే తాజా బడ్జెట్‌లో జనగణన కోసం పరిమిత కేటాయింపులు మాత్రమే చేయడమే ఇందుకు ప్రధాన కారణం. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో జనగణన, జాతీయ జనాభా పట్టి (NPR) కోసం రూ.574.80 కోట్లు మాత్రమే కేటాయించారు. దీన్ని బట్టి చూస్తే ఈ ఏడాది కూడా జనగణన జరగకపోవచ్చనే ప్రచారం నడుస్తోంది.  

Also Read: ‘బుల్లెట్ గాయాలకు బ్యాండేజ్‌లా’ 2025 బడ్జెట్‌పై రాహుల్ గాంధీ విమర్శలు

వాస్తవానికి 2021-22లో జనగణను రూ.3,768 కోట్లు ప్రతిపాదించారు. కానీ ఆ ఏడాది అడుగులు పడలేదు. 2023-24లో రూ.578.29 కోట్లు కేటాయించారు. 2024-25లో దాన్ని పెంచి రూ.1,309.46 కోట్లు కేటాయించారు. 2025-26 చూసుకుంటే ఈసారి ఏకంగా సగం తగ్గిపోయింది. ఇదిలాఉండగా.. రూ.8,754.23 కోట్లతో జనగణన, రూ.3,941.35 కోట్లతో ఎన్‌పీఆర్‌ను నవీకరించేందుకు కేంద్ర కేబినెట్ 2019 డిసెంబర్ 24న ఆమోదం తెలిపింది. వాస్తవానికి 2020 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ఈ ప్రక్రియ జరగాలి. కానీ కరోనా వల్ల వాయిదా పడింది. అప్పటినుంచి అలా వాయిదా పడుతూనే వస్తోంది.  

Also Read: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి వరాలు.. పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్‌తో పాటు కేటాయింపులివే!

మరోవైపు భారత్‌.. చైనాను దాటి అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలిచిట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటన చేసింది. కానీ దీనికి కచ్చితమైన లెక్కలు లేవు. వేరు వేరు పథకాలకు సంబంధించి 2011 నాటి గణాంకాల ఆధారంగా లక్ష్యాలు, వ్యయ అంచనాలు తయారుచేస్తున్నారు. అయితే 9 ఏళ్ల వ్యవధిలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్లు నీతిఆయోగ్ వెల్లడించింది. సరైన లెక్కలు లేకుండానే ఈ ప్రకటన చేయడంతో దీనిపై తీవ్ర అభ్యంతారాలు వచ్చాయి. అయితే జన గణన జరిగేవరకు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కూడా జరగదు. మరి దీనికి ఎప్పుడు ముందుడుగు పడుతోందో ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.   

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు