Budget 2025: వ్యవసాయ, తయారీ రంగాల్లో ఇవే టాప్ 10 బడ్జెట్ హైలెట్స్

కేంద్రం పార్లమెంట్లో 2025 బడ్జెట్ ప్రవేశపెట్టింది. వ్యవసాయం, తయారీ రంగాలకు ఆర్థిక శాఖ పెద్ద పీట వేసింది. ఆయా రంగాలకు భారీగా నిధులు కేటాయించింది. మేక్ ఇన్ ఇండియా, అగ్నికల్చర్ లో ఉత్పదకత పెంచడమే లక్ష్యంగా మోదీ సర్కార్ బడ్జెట్ కేటాయింపులు జరిగాయి.

author-image
By K Mohan
New Update
budget 10 points

budget 10 points Photograph: (budget 10 points)

మోదీ గవర్నమెంట్ 2025 బడ్జెట్‌ (Budget 2025) లో పన్ను పరిధిలోకి రాని ఆదాయ పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచింది. దీంతో ఎంప్లాయిస్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అందేకాదు అనేక రంగాలకు పెద్ద ఎత్తున బడ్డెట్ కేటాయింపులు చేశారు. బిహార్ రాష్ట్రానికి ఇందులో భారీ కేటాయింపులు జరిగాయి. వ్యవసాయ, తయరీ రంగంలో 2025 బడ్జెట్‌ టాప్ 10 మార్పులు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

Also Read :  తిరుపతి లడ్డూ తయారీని పరిశీలించిన టీటీడీ చైర్మన్.. అధికారులకు కీలక ఆదేశాలు!

Budget 2025 In Agriculture And Manufacturing Sectors

  1. మేక్ ఇన్ ఇండియా (Make In India) ను ముందకు తీసుకెళ్లడానికి చిన్న, మధ్యతరహా, పెద్ద పరిశ్రమలకు తయారీ మిషన్ ద్వారా లబ్దిపొందనున్నాయి. 
    2. పాదరక్షలు, లెదర్ ఫ్యాక్టరీస్‌లో ఉత్పాదకత, నాణ్యత మరియు పోటీతత్వాన్ని పెంచడానికి ప్రభుత్వం నిర్దిష్ట విధానాలు, సౌకర్యాలను తీసుకురానుంది.
    3. బొమ్మల తయారీ రంగాన్ని విస్తరించడానికి చర్యలు తీసుకోనున్నారు. క్లస్టర్లు, స్కిల్ డెవలప్‌మెంట్ మరియు ఉత్పాదక పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై కేంద్రం దృష్టి సారించనుంది.
    4. ఈ బడ్జెట్‌లో 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకురనుంది. ప్రధాన మంత్రి కృషి యోజన పథకం కింద, ప్రభుత్వం రాష్ట్రాల భాగస్వామ్యంతో రైతుల కోసం జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అంతేకాదు కిసాన్ క్రెడిట్ కార్డుల లిమిట్ రూ.5 లక్షల వరకు పెంచారు. 
    5. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి, ఆర్థిక మంత్రి ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజనను ప్రకటించారు. ఈ పథకం 100 జిల్లాలకు వర్తిస్తుంది. ఇది పంటల వైవిధ్యం, నిల్వను పెంచడం, నీటిపారుదల మెరుగుపరచడం మరియు రైతులకు దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక రుణ సౌకర్యాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

Read also ;బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోయిస్టులు మృతి

  • 6. బీహార్‌లో లోటస్ సీడ్స్ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. పప్పుధాన్యాల కోసం స్వయంశక్తి మిషన్ ప్రారంభిస్తున్నట్లు.. ఇది 6 సంవత్సరాల పాటు కొనసాగనుంది.
    7.యూరియా సరఫరాను మరింత పెంచేందుకు  అస్సాంలో యూరియా ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. అస్సాంలోని నామ్‌రూప్‌లో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు.
    8. కేంద్రం బీహార్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్‌ను ఏర్పాటు చేస్తుంది.
    9. ఐఐటీ పాట్నా విస్తరించబడుతుంది. అన్ని మాధ్యమిక పాఠశాలలు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు అందించబడతాయి.
    10. ఈ బడ్జెట్‌లో SC, STలకు చెందిన 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తల కోసం కొత్త పథకం తీసుకువచ్చారు.

Read also : Makhana Board : ఏమిటీ మఖానా... నిర్మలా సీతారామన్ ప్రకటించిన బోర్డు ఎందుకు?

Also Read :  10 మంది ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ .. కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు