Makhana Board : ఏమిటీ మఖానా... నిర్మలా సీతారామన్ ప్రకటించిన బోర్డు ఎందుకు?

బీహార్ లో ముఖానా బోర్డు ఏర్పాటుచేయనున్నట్లుగా నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. మఖానా బోర్డు ద్వారా ఉత్పత్తి, మార్కెటింగ్, ప్రాసెసింగ్ అవకాశాలు మెరుగుపడనున్నాయని ఆమె తెలిపారు.  దీనికింద రైతులకు శిక్షణ అందుతుందని వెల్లడించారు.

author-image
By Krishna
New Update
Nirmala Sitharaman announces Makhana Board

Nirmala Sitharaman announces Makhana Board

కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి తొలిసారిగా పూర్తిస్థాయి తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూనియన్ బడ్జెట్ లో బీహార్ పై వరాల జల్లు కురిపించారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఆ రాష్ట్రానికి పద్దులో ప్రత్యేక స్థానం దక్కింది.  బీహార్ లో ముఖానా బోర్డు ఏర్పాటుచేయనున్నట్లుగా నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.

మఖానా బోర్డు ద్వారా ఉత్పత్తి, మార్కెటింగ్, ప్రాసెసింగ్ అవకాశాలు మెరుగుపడనున్నాయని ఆమె తెలిపారు.  దీనికింద రైతులకు శిక్షణ అందుతుందని తద్వారా..  వారు అన్ని ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనం పొందేలా బోర్డు చూస్తుందని తెలిపారు.  అంతేకాకుండా  రైతుల ఆదాయాన్ని పెంచడానికి బీహార్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీని ఏర్పాటు చేస్తున్నట్లు సీతారామన్ ప్రకటించారు. అంతగా తెలియని ఈ మఖానా అంటే ఏమిటి అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. 

బీహారీలు చాలా ఏళ్లుగా మఖానాను పండిస్తున్నారు.  ఇంతకీ మఖానా అంటే  ఇదొక రకమైన ఆహారం. ఇవి ఆకుల మాదిరిగా ఉండి గింజలాంటి నిర్మాణంలో ఉంటాయి. వీటిలో గింజల లాంటివి వస్తాయి. దేశంలో 90 శాతం మఖానాను బీహార్ లో మాత్రమే ఉత్పత్తి చేస్తారు. ఉత్తర బీహార్ ప్రాంతంలో దీనిని ఎక్కువగా పండిస్తారు. దీంతో ఆ ప్రాంతానికి మఖానా అనే పేరు కూడా వచ్చింది.  బడ్జెట్ లో మఖానా కోసం ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు  కేంద్రం ప్రకటించింది. ఈ రంగంలో కొత్తగా ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడనున్నాయి. మఖానాకు డిమాండ్ పెరుగుతున్నందునే ప్రభుత్వం దాని ఉత్పత్తిని మరింత ప్రోత్సహించాలని భావిస్తోంది.  ఇందులో ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు , కాల్షియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.  

వంద గ్రాముల పూల్ మఖానాలో ఉండే పోషకాలు:

శక్తి :347 క్యాలరీలు
పిండి పదార్థాలు:77 గ్రాములు
కొవ్వు: 0.1 గ్రాములు
ప్రొటీన్లు: 9.7 గ్రాములు
పీచు:14.5 గ్రాములు
ఐరన్:1.4 మిల్లి గ్రామాలు
కాల్షియం: 60 మిల్లి గ్రాములు
పాస్పరస్: 90 మిల్లి గ్రాములు
పొటాషియం:500 మిల్లి గ్రాములు

Aslo Read :  బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోయిస్టులు మృతి

Advertisment
తాజా కథనాలు