School Teachers Rape : ఒడిశాలో దారుణం..విద్యార్థినిపై ఐదుగురు టీచర్ల అత్యాచారం

విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పి వారిని ఉన్నతులుగా తీర్చి దిద్దాల్సిన ఉపాధ్యాయులు అమానుషానికి పాల్పడ్డారు. ఒక బాలికను లైంగికంగా వేధించడమే కాకుండా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత విద్యార్థిని కుటుంబం ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది.

New Update
23-Year-Old Odisha Woman Alleges Six-Month Abduction, Gang-Rape After Escape

Five teachers rape a student

School Teachers Rape : విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పి వారిని ఉన్నతులుగా తీర్చి దిద్దాల్సిన ఉపాధ్యాయులు అమానుషానికి పాల్పడ్డారు. ఒక బాలికను లైంగికంగా వేధించడమే కాకుండా బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత విద్యార్థిని కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. ఫలితంగా ఐదుగురు ఉపాద్యాయులు అరెస్ట్‌ అయ్యారు. ఈ ఘటన  ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో జరిగింది. జిల్లాలోని ఒక ప్రైవేటు పాఠశాలలో 13 ఏళ్ల బాలిక ఏడో తరగతి చదువుతుంది. అయితే ఆ స్కూల్‌కు చెందిన ఐదుగురు టీచర్లు చాలా కాలంగా ఆ విద్యార్థినిని లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. అంతటితో ఆగకుండా బాలికపై పలుమార్లు అత్యాచారానికి కూడా పాల్పడ్డారు.

కాగా, టీచర్ల భయంతో ఇన్నాళ్లు భరించిన ఆ బాలిక ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో ఫిబ్రవరి 19న ఆమె కుటుంబ సభ్యులు జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీని ఆశ్రయించారు. ఆ కమిటీ ప్రాథమికంగా విచారణ  చేపట్టింది. అంతేకాక బాలిక ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు జరుపాలని పోలీసులు, జిల్లా విద్యాశాఖ అధికారిని కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశించింది.

అదే సమయంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, బాలిక తండ్రి ఫిర్యాదుపై రాజ్‌కనికా పోలీస్‌ స్టేషన్‌ అధికారి స్పందించారు. బాధిత బాలిక స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేశామన్నారు. వైద్య పరీక్షల తర్వాత లైంగిక దాడిపై కేసు నమోదు చేశామన్నారు. నిందితులైన ఐదుగురు టీచర్లను అరెస్ట్‌ చేసినట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు