TG News: హైదరాబాద్‌లో దారుణం.. ఎస్సై తల పగలగొట్టిన గంజాయి గ్యాంగ్
హైదరాబాద్‌లోని మెహిదీపట్నం హబీబ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో వెళ్లిన పోలీసులపై దాడికి దిగింది. బీర్ బాటిల్‌తో దాడి చేయడంతో ఎస్ఐ తల పగిలింది. ఈ ఘటనలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు.