Ranya Rao: ఎయిర్ పోర్టులో అడ్డంగా దొరికిన హీరోయిన్..ఆ పనిచేస్తూ పోలీసులకు..

కన్నడ ప్రముఖ హీరోయిన్ రన్యారావును నుండి కస్టమ్స్ అధికారులు 14.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నరు. కన్నడ నటి రన్యా రావు. బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్-డీఆర్ఐ అధికారులకు పట్టుబడింది.

New Update
 Ranya Rao

 Ranya Rao

 Ranya Rao: కన్నడ ప్రముఖ హీరోయిన్ రన్యారావును నుండి కస్టమ్స్ అధికారులు 14.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నరు. కన్నడ నటి రన్యా రావు. బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్-డీఆర్ఐ అధికారులకు పట్టుబడింది. బెంగళూరు ఎయిర్ పోర్టులో దుబాయ్ నుండి వచ్చిన కన్నడ సినీ నటి రన్యా రావు నుండి 14.8 కిలోల గోల్డ్‌ను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాన్యా ఇటీవల తరచూ దుబాయ్‌ వెళ్లి వస్తుండడంతో ఆమెపై నిఘా పెట్టారు. గత 15 రోజుల్లో 4 సార్లు దుబాయ్‌ వెళ్లొచ్చిన రాన్యా.. ఎలాంటి అనుమానం రాకుండా.. గోల్డ్‌ బిస్కెట్లను దుస్తుల్లో దాచి, తీసుకొచ్చేవారని డీఆర్‌ఐ అధికారులు తెలిపారు.  రన్యా రావు దుబాయ్ నుంచి బెంగళూరుకు అక్రమ మార్గాల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.  

Also read :   Shama Mohamed: రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ .. ఎవరీ  షామా మొహమ్మద్?

Also Read: అసెంబ్లీలో గుట్కా నమిలి ఉమ్మిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్

బంగారం స్మగ్లింగ్‌ కేసులో పట్టుబడిన కన్నడ నటి రన్యా రావును అరెస్ట్‌ చేసిన పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. మార్చి 3న ఆమె దుబాయ్ నుంచి తీసుకువచ్చిన 14.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ గోల్డ్ విలువ రూ.12 కోట్లు ఉంటుందని తెలిపారు. రన్యా రావును డీఆర్ఐ అధికారులు ప్రశ్నిస్తుండగా.. తాను డీజీపీ కూతురిని అని ఆమె ప్రచారం చేసుకుంటున్నట్లు గుర్తించారు. గతంలో కూడా రన్యా రావు ఇలాగే అనేక సందర్భాల్లో ఈ రకమైన బంగారం అక్రమ రవాణాకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కన్నడలో కిచ్చ సుదీప్‌తో కలిసి రన్యా రావు.. మాణిక్య అనే సినిమాలో నటించింది.

Also Read: 'మీరు పెంచితే మేము పెంచుతాం'.. అమెరికాకు చైనా షాక్

Also Read :  తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇలా!

Aslo Read: TG Inter Exams: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు.. విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు