/rtv/media/media_files/2025/05/28/jlbfXXXx6eFxiiN3Bim5.jpg)
Airbus-Helicopters
Tata-Airbus Helicopter:
దేశంలో తొలి ప్రైవేట్ హెలికాప్టర్ల తయారీ కోసం కర్ణాటక సిద్ధమైంది. యూరప్‌కు చెందిన విమాన ఉత్పత్తుల సంస్థ ఎయిర్‌బస్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ (టీఏఎస్‌ఎల్)లు ఉమ్మడిగా కర్ణాటకలోని కోలారు జిల్లాలో హెచ్ 125 తేలికపాటి హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయి. మొదట 10 యూనిట్లు, ఆ తర్వాత వచ్చే20 ఏళ్లలో 500 హెలికాప్టర్ల తయారీ లక్ష్యంగా దీన్ని విస్తరించనున్నారు.
Also Read: కొచ్చి తీరంలో హై అలర్ట్..మునిగిన నౌకలో ప్రమాదకర రసాయనాలు..?
Also Read: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? వెంటనే చెక్ చేసుకోండి.. లేదంటే..!
కోలారులోని వేమగల్ పారిశ్రామిక వాడలో ఏర్పాటు చేయనున్న ఈ కేంద్రంలో హెలికాప్టర్ల తయారీకి పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. అలా తయారైన వాటిని దేశీయ అవసరాలకు, భారతీయ సైన్యానికి, ఇతర దేశాలకూ సరఫరా చేయడానికి సిద్ధమవుతున్నారు. దీంతో ఫ్రాన్స్, అమెరికా, బ్రెజిల్ తర్వాత హెచ్ 125 హెలికాప్టర్ల తయారీ యూనిట్ స్థాపించే నాలుగో దేశంగా భారత్ నిలవబోతుంది. హెలికాప్టర్ల తయారీ, నిర్వహణ, మరమ్మతు, ఒప్పంద కార్యక్రమ (ఎంఆర్‌ఓ) కార్యకలాపాల కోసం అవసరమైన 7.40 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని సేకరించేందుకు ఆ రెండు సంస్థలు సిద్ధమయ్యాయి. దీంతో పాటు ఇతర ఒప్పంద కార్యక్రమాలు వేగంగా పూర్తి చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ క్లియరెన్స్ విండోను ఏర్పాటు చేసినట్లు భారీ పరిశ్రమల శాఖ ఈ మేరకు వెల్లడించింది.
Also Read: అమెరికాలో పాక్ పౌరుల అరెస్ట్.. వాళ్లు ఏం చిల్లర పని చేశారో తెలుసా?
Also Read: ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం