Brain Swelling Symptoms: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? వెంటనే చెక్ చేసుకోండి.. లేదంటే..!

మెదడులో వాపు అత్యంత ప్రమాదకరమైన సమస్య. దీనిని వైద్య భాషలో "సెరిబ్రల్ ఓడీమా" అని పిలుస్తారు. ఇది పాథాలజికల్ స్థాయికి చేరుకుంటే, ప్రాణాలకే ముప్పు. ఈ ఆర్టికల్ లో మెదడువాపు లక్షణాలు ఏవో, ముందుగా ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.

New Update
Brain Swelling Symptoms

Brain Swelling Symptoms

Brain Swelling Symptoms: ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలు ఎవరికి ఎప్పుడు వస్తాయో చెప్పలేము. శరీరంలో ఏ భాగంలోనైనా వాపు కనిపిస్తే అది చిన్న విషయం కాదు. ముఖ్యంగా మెదడులో వాపు అత్యంత ప్రమాదకరమైన సమస్య. దీనిని వైద్య భాషలో "సెరిబ్రల్ ఓడీమా" (Cerebral Edema) అని పిలుస్తారు. ఇది పాథాలజికల్(Pathological Level) స్థాయికి చేరుకుంటే, ప్రాణాలకే ముప్పు వస్తుంది. ఈ ఆర్టికల్ లో మెదడువాపు లక్షణాలు ఏవో, ముందుగా ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.

Also Read: ఏసీ గది నుంచి నేరుగా ఎండలోకి వెళ్తున్నరా..? అయితే మీ ఆరోగ్యానికి..!!

1. తలనొప్పి(Headache) -  మెదడువాపు తొలి సంకేతం

ఒక్కసారిగా తీవ్రమైన తలనొప్పి రావడం, మళ్ళీ మళ్ళీ తలనొప్పులు రావడం, సాధారణ తలనొప్పిలా కాకుండా భిన్నంగా అనిపించడం, ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇది మెదడులో వాపు మొదలైందని సూచించే ముఖ్యమైన లక్షణం. వెంటనే వైద్యుని సంప్రదించడం ఉత్తమం.

Also Read: తిన్న తర్వాత ఈ ఐదు సమస్యలు ఉంటే ఆరోగ్యం క్షీణిస్తోందని అర్థం

2. నిద్రలేమి, నిద్రలో అంతరాయం

మెదడువాపు ఉన్నప్పుడు రాత్రిళ్లు నిద్ర పూర్తిగా పట్టకపోవడం, నిద్ర మధ్యలో మేలుకోవడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది శరీరానికి, మెదడుకు విశ్రాంతి లేకుండా చేస్తుంది. దీని వలన మరిన్ని ఆరోగ్య సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంటుంది.

3. మెడ నొప్పి, గట్టితనం

ఎలాంటి కారణం లేకుండా మెడలో తీవ్ర నొప్పి, కదలించలేనంత గట్టితనం కనిపిస్తే, ఇది మెదడు సంబంధిత సమస్యల సంకేతంగా పరిగణించాలి. ఇది మెదడువాపును సూచించే అవకాశం ఉంది. ఆలస్యం చేయకుండా వైద్య సలహా తీసుకోవాలి.

Also Read: కోవిడ్ తర్వాత.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యానికే డేంజర్ !

4. రక్తపోటులో మార్పులు

ఎటువంటి ఒత్తిడి లేకపోయినా, ఆరోగ్య పరిస్థితి బాగుండినా, రక్తపోటు తరచూ పెరగడం ఒక ప్రమాద సంకేతం. ఇది మెదడులో శరీరతంత్రాన్ని ప్రభావితం చేస్తున్న వాపు వల్ల కావచ్చు. ఇది హైపర్‌టెన్షన్‌తో ముడిపడిన మెదడు సమస్యలలో ఒకటి కావచ్చు.

5. తిన్న వెంటనే వికారం, వాంతులు

ఏం తిన్నా వెంటనే వికారం రావడం, వాంతి అనిపించడం సాధారణమైన జీర్ణ సమస్యల కారణంగా అనిపించవచ్చు. కానీ ఇదే సమస్య తరచూ జరుగుతోంటే, అది మెదడులో జరిగే అసాధారణ పరిస్థితిని సూచిస్తోంది.

Also Read: బరువు తగ్గడానికి 8 రహస్యాలు..ఆశ్చర్య పరిచే అలవాట్లు

మెదడులో వాపు అనేది తక్షణ వైద్య సహాయం అవసరమైన సమస్య. దీని లక్షణాలను ముందుగా గమనించి, చికిత్స తీసుకుంటే ప్రాణాపాయాన్ని నివారించవచ్చు. ఆరోగ్యం పట్ల అప్రమత్తత మన జీవితాన్నిరక్షించగలదు. కాబట్టి  జీవితంలో ఎప్పుడూ ఆరోగ్యాన్ని మొదటి ప్రాధాన్యంగా తీసుకోండి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు