Dharmasthala case : ధర్మస్థల శవాల వెనుక అంతుచిక్కని మిస్టరీలు.. వెలుగులోకి సంచలన విషయాలు!

దేశవ్యాప్తంగా ప్రస్తుతం ధర్మస్థల కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ప్రధానంగా ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఆరోపణల నేపథ్యం చుట్టూ దర్యాప్తు జరుగుతోంది.

New Update
dharamasthali case

దేశవ్యాప్తంగా ప్రస్తుతం ధర్మస్థల కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ప్రధానంగా ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఆరోపణల నేపథ్యం చుట్టూ దర్యాప్తు జరుగుతోంది. ధర్మస్థల శవాల వెనుక అంతుచిక్కని మిస్టరీలు వెలుగులోకి వస్తున్నాయి. ఆడ, -మగ, చిన్నా, -పెద్దా అనే బేధం లేకుండా హత్యలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఒంటరిగా అమ్మాయిలు కనిపిస్తే చాలు అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదేం అన్యాయం అని బాధితుల తరుపున  ప్రశ్నించిన మగాళ్లు కూడా కనిపించకుండా పోయారు. మరికొందరు పోరాటానికి దిగి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇలాంటి అరాచకాలు, ఆకృత్యాలు  నాలుగు దశాబ్దాలకు పైగా సాగినట్లుగా తెలుస్తోంది. డబ్బు, పలుకుబడితో ఆధారాలు మాయం చేశారు హంతకులు. 2014 నుంచి శవాలను మార్చినట్లు ఎన్నో అనుమానాలున్నాయి. ఇప్పుడు దొరికిన శవాలు బాధితులవి కావన్న సందేహాలు కూడా ఉన్నాయి.  ధర్మస్థల అంటేనే శవాల దిబ్బగా పరిసర గ్రామాల ప్రజలు చెప్పుకునే స్థాయికి పరిస్థితి మారింది. 

చాలావరకు లైంగిక కేసులే 

 దేశవ్యాప్తంగా ఈ ధర్మస్థల కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. దక్షిణ కన్నడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల పరిధిలో వందలాది మంది మహిళల మృతదేహాలను సామూహికంగా పూడ్చిపెట్టినట్లు, వాటిలో చాలావరకు లైంగిక దాడికి గురైనట్లు 50 ఏళ్ల మాజీ పారిశుధ్య కార్మికుడి ఆరోపణల మేరకు  పోలీసులు ముందుగా కేసు నమోదు చేశారు.  తాను 1995 నుండి 2014 వరకు ధర్మస్థలలో పని చేస్తున్నప్పుడు బలవంతంగా  తన చేతులతోనే ఈ మృతదేహాలను పూడ్చిపెట్టానని పోలీసులకు ఫిర్యాదు చేశాడాతను . తాను ఖననం చేసిన మృతదేహాలు, అవశేషాలు వాటికి సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా కోర్టుకు సమర్పించాడు. హత్యలకు పాల్పడిన వారి పేర్లను కూడా అతను వెల్లడించినట్లుగా తెలుస్తోంది.  గతంలో జరిగిన సౌజన్య అత్యాచారం, హత్య కేసు (2012), పద్మలత మరణం (1986), అనన్య భట్ అదృశ్యం (2003) వంటి అనేక అంతుచిక్కని మరణాలు, అదృశ్యమైన కేసులను మళ్ళీ తెరపైకి తెచ్చాయి. ఈ ప్రాంతంలో దాదాపు 367 మందికి పైగా అదృశ్యమైన, మరణించిన కేసులు ఉన్నాయని లాయర్లు   అంటున్నారు.  

ఈ ఆరోపణలపై ధర్మస్థల పోలీసులు 2025 జూలై 3న కేసు నమోదు చేశారు. ఈ ఆరోపణల తీవ్రత దృష్ట్యా, కర్ణాటక ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రణవ్ మహంతి నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ను ఏర్పాటు చేసింది. ఈ సిట్ బృందం జూలై 28న దర్యాప్తు ప్రారంభించింది. ఫిర్యాదుదారుడు గుర్తించిన 15 ప్రదేశాలలో మృతదేహాలు పూడ్చిపెట్టినట్లు ఆరోపించిన ప్రాంతాల్లో తవ్వకాలను ప్రారంభించింది.  సిట్ బృందం నెత్రావతి నది పక్కన, రహదారుల పక్కన, అటవీ ప్రాంతాలలో తవ్వకాలు జరుపుతోంది. అయితే, జూలై 30 నాటికి మొదటి రెండు రోజుల్లో తవ్విన ప్రదేశాలలో ఎటువంటి అవశేషాలు కూడా లభ్యం కాలేదు. మొత్తంగా ఈ కేసు కర్ణాటకలో తీవ్ర చర్చకు దారితీసింది, దీని వెనుకున్న నిజానిజాలను బయటపడాలని ప్రజలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం  దర్యాప్తు వేగవతంగా కొనసాగుతోంది కాబట్టి రాబోయే రోజుల్లో దీనిపై మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు