/rtv/media/media_files/2025/07/30/dharmasthala-1-2025-07-30-10-54-56.jpg)
Dharmasthala
Dharmasthala: ధర్మస్థల మిస్టరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. దీనిపై విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) చేపట్టిన తవ్వకాల్లో మనిషికి చెందిన అస్థిపంజర అవశేషాలు బయటపడినట్లు తెలుస్తోంది. ధర్మస్థలలోని శ్రీక్షేత్ర సమీపంలో గల అటవీ ప్రాంతంలో కొన్ని శవాలను పూడ్చి పెట్టానని నాటి పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన ప్రదేశాల్లో సిట్ ఆధ్వర్యంలో తవ్వకాలు జరుపుతున్నారు. ఈ తవ్వకాల్లో ఓ చోట గురువారం కొన్ని అవశేషాలను బృందం గుర్తించింది. ఇప్పటివరకు ఈ కేసు విషయంలో బయటపడిన తొలి ఆధారం ఇదే కావడం గమనించాల్సిన అంశం. 1998 నుండి 2014 మధ్యకాలంలో నేత్రావతి ఘాట్ సమీపంలో గల అడవిలో వందల మందిపై అత్యాచారం చేసి వారిని హత్య చేశారని, వారిలో మహిళలు, బాలికలు ఉన్నారని, ఆ శవాలను అక్కడే పాతిపెట్టినట్లు ఓ గుర్తు తెలియని మాజీ శానిటేషన్ కార్మికుడు వాంగ్మూలం ఇవ్వడంతో ఈ తవ్వకాలు మొదలయ్యాయి.
Also Read: 10 నిమిషాల్లో లక్షల కోట్ల నష్టం.. ట్రంప్ టారిఫ్‌తో కుప్పకూలిన స్టాక్ మార్కెట్!
శానిటేషన్ కార్మికుని వాంగ్మూలం ఆధారంగా ఇప్పటివరకు ఐదు చోట్ల తవ్వకాలు జరిపినా ఎటువంటి మానవ అవశేషాలు బయల్పడలేదు. కానీ రెండో రోజు తవ్వకాల్లో మానవ అస్థిపంజరం భాగాలు దొరికాయి. SIT అధికారుల సమాచారం ప్రకారం అవి మనిషికి చెందినవే అని గుర్తించారు. ప్రాథమికంగా పరిశీలించగా అవి ఓ పురుషునికి సంబంధించినవిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆ కార్మికుని వెంట తీసుకెళ్లి దర్యాప్తు చేపట్టిన అధికారులు నేత్రావతి నది స్నానఘట్టానికి అవతలి వైపు ఉన్న ప్రాంతం నుంచి తవ్వకాలు ప్రారంభించారు. కాగా, మృతదేహాలను పూడ్చిన చోటు అంటూ ఆ కార్మికుడు 13 ప్రాంతాలను అతడు గుర్తించాడు. దీంతో అతను చూపించిన ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఐదు ప్రాంతాల్లో ఎలాంటి ఆనవాళ్లు బయటపడగా పోగా గురువారం ఆరో ప్రాంతంలో మానవ అవశేషాలు బయటపడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకున్న ఫోరెన్సిక్ బృందం టెస్ట్ కోసం ల్యాబ్‌కు పంపించింది. ల్యాబ్‌లో పరీక్షించిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
అసలు కేసు ఏంటంటే ?
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థల అనేది ఒక ప్రముఖ శైవ క్షేత్రం. ఇక్కడికి కర్ణాటకతో పాటు ఇతర పొరుగు రాష్ట్రాల నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇదిలా ఉండగా గతంలో అక్కడ పనిచేసి మానేసిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు.. ఇటీవల సంచలన విషయాలను వెల్లడించాడు. 1998 నుంచి 2014 మధ్య ఇక్కడ అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారన్నారు. ఆ హత్యకు గురైన వారి మృతదేహాలను తానే పూడ్చి పెట్టానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ మతదేహాలన్నీ అనుమానాస్పద రీతిలో అదృశ్యమైన వారివని, వారంతా లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు అనుమానాలున్నట్లు పేర్కొన్నాడు. దీంతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. ఈ క్రమంలోనే 2014 డిసెంబరులో తమ కుటుంబంలోని ఒక యువతిని కొందరు లైంగికంగా వేధించారని తెలిపాడు. దీంతో తాము అజ్ఞాతంలోకి వెళ్లిపోయామని ఆ వ్యక్తి చెప్పినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి మృతదేహాలను ఎవరు ఖననం చేయమన్నారు? వాటిని ఎవరి సహాయంతో తీసుకువెళ్లి ఖననం చేసేవారు? వంటి వివరాలను సిట్ అధికారులు అడిగి తెలుసుకున్నారు.
Also Read: భారత్‌పై 25 శాతం సుంకాలు.. ఈ ఎగుమతులపై తీవ్రంగా ప్రభావం