మన దేశంలో రెండుసార్లు బడ్జెట్ లీక్.. ఆర్థిక మంత్రి ఔట్.. అప్పుడు ఏం జరిగిందో తెలుసా?

దేశంలో రెండుసార్లు బడ్జెట్ లీకైంది. స్వతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి సారి 1947లో ఆర్ కే చెట్టి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో లీక్ అయ్యింది. మరోసారి 1950లో జాన్ మథాయ్ ఉన్న సమయంలో బడ్జెట్ లీక్ కావడంతో అతను పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

New Update
Leak budgets

Leak budgets Photograph: (Leak budgets)

నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 8వ సారి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టబోతున్నారు. అయితే మన దేశ చరిత్రలో ఇప్పటికీ రెండుసార్లు బడ్జెట్ లీక్ అయ్యింది. 1947, 1950లో రెండు సార్లు లీకైంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి సారి 1947లో ఆర్ కే చెట్టి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సమయంలో చెట్టి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రికి పంపించగా లీక్ అయ్యింది. రెండో సారి 1950లో జాన్ మథాయ్ ప్రవేశ పెట్టే బడ్జెట్ లీక్ కావడంతో ఆర్థిక మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. 

ఇది కూడా చూడండిCricket: హమ్మయ్యా...సీరీస్ కొట్టేశారు..నాలుగో టీ20లో భారత్ ఘన విజయం

ఇది కూడా చూడండి: Maha Kumbh Mela: రైల్వేశాఖకు పెద్ద షాకిచ్చిన భక్తుడు.. కుంభమేళాకు వెళ్లలేకపోయినందుకు 50 లక్షల నష్ట పరిహారం కట్టాల్సిందే!

ఎంతో రహస్యంగా బడ్జెట్‌ను ఉంచినప్పటికీ లీక్ కావడంతో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. వెంటనే బడ్జెట్ ప్రింటింగ్‌ ప్లేస్‌ను మార్చారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఫస్ట్ బడ్జెట్ సమర్పించే బాధ్యతను ఆర్‌కె చెట్టికి అప్పగించారు. అయితే ఇది స్వతంత్ర భారతదేశం ఫస్ట్ బడ్జెట్ కావడంతో అతను సలహా కోసం బ్రిటన్ ఆర్థిక మంత్రి హ్యూ డాల్టన్‌కు పంపారు. డాల్టన్ బ్రిటీష్ పార్లమెంటు దిగువ సభకు వెళ్తుంటే.. ఓ జర్నలిస్ట్ దీని గురించి ప్రశ్నలు అడిగారు. ఈ సమయంలో డాల్టన్ కొన్ని విషయాలు తెలియజేయడంతో బడ్జెట్ లీకైంది. అప్పట్లో బడ్జెట్‌ను సాయంత్రం 5 గంటలకు ప్రవేశ పెట్టేవారు. అయితే చెట్టి బడ్జెట్ ప్రవేశ పెట్టకముందే సమాచారమంతా లీకైంది. 

రెండోసారి ఎలా అంటే?

రెండవ సారి కేంద్ర బడ్జెట్ 1950లో లీకైంది. ఆర్థిక మంత్రి జాన్ మథాయ్ ఉన్న సమయంలో రాష్ట్రపతి భవన్‌లోని బడ్జెట్‌ను ప్రింటింగ్ చేశారు. ఈ సమయంలో బడ్జెట్ లీకైంది. మథాయ్ ధనవంతుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని ఆరోపణలు రావడంతో అతను పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.  

ఇది కూడా చూడండి: Karthikeya 3: కార్తికేయ-3 పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్ చందూ మొండేటి..!

Advertisment
Advertisment
తాజా కథనాలు