BIG BREAKING: జమ్ముకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్

జమ్మూ కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అందులో ఓ ఉగ్రవాదిని హతమార్చామని ఇండియన్ ఆర్మీ అధికారులు ధృవీకరించారు. దక్షిణ కశ్మీర్‌లోని అకల్ అటవీ ప్రాంతంలో జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.

New Update
Jammu Kashmir encounter

జమ్మూ కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాదిని హతమార్చామని శనివారం ఉదయం ఆర్మీ అధికారులు ధృవీకరించారు. దక్షిణ కశ్మీర్‌లోని అకల్ అటవీ ప్రాంతంలో టెర్రరిస్టుల కదలికల సమాచారంతో భారత సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. 

చనిపోయిన ఉగ్రవాది లష్కరే తోయిబాకు చెందినవాడని అనుమానిస్తున్నారు. అయితే, అతడి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రాంతంలో ఇంకా ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు దాక్కుని ఉంటారని ఇండియన్ ఆర్మీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేసి, మొత్తం అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. రాత్రిపూట ఆపరేషన్ చేయడం సవాలుగా ఉన్నప్పటికీ, ఉగ్రవాదులు తప్పించుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత దళాలు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లను తీవ్రతరం చేశాయి. 'ఆపరేషన్ మహదేవ్' పేరుతో భద్రతా దళాలు ఉగ్రవాదులను ఏరివేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగానే కుల్గామ్‌లో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ చర్యలు సరిహద్దుల భద్రతను బలోపేతం చేయడంతో పాటు, స్థానిక ప్రజలకు భరోసా కల్పించేందుకు తోడ్పడతాయి. అయితే, అకల్ అటవీ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు