Nikki Haley: భారత్ తో సంబంధాలు చెడగొట్టుకోవద్దు..ట్రంప్ కు నిక్కీ హేలీ వార్నింగ్..

భారత్ విషయంలో సొంత పార్టీ నుంచే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు వ్యతిరేకత ఎదురైంది. భారత్ తో సంబంధాలు చెడగొట్టుకోవద్దంటూ నిక్కే హేలీ ఆయనను హెచ్చరించారు. చైనాకు లేని రూల్ భారత్ కు ఎందుకని ఆమె ప్రశ్నించారు.  

New Update
nikki

Nikki Haley

భారత్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోందని, తద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి సాయం చేస్తుందని ట్రంప్ ఆరోపించారు. భారత్ తమకు స్నేహ దేశం.. కానీ వాణిజ్య విషయంలో అసలు మంచి భాగస్వామి కాదని అన్నారు. భారత్ అమెరికాతో భారీగా వ్యాపారం చేస్తుందని, కానీ అమెరికా ఆ స్థాయిలో చేయడం లేదు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇప్పటికే భారత్ పై ట్రంప్ 25 శాతం సుంకాలు విధించారు. రష్యాతో చమురు వ్యాపారం మానుకోకపోతే మళ్ళీ 24 గంటల్లో వీటిని మరింత పెంచుతామని హెచ్చరించారు. అయితే దీనిని భారత్ గట్టిగా తిరస్కరించింది. తమ దేశానికి ఏది అవసరమో అదే చేస్తామని చెప్పింది. అమెరికా అణు పరిశ్రమ, విద్యుత్ వాహనాలు, ఎరువుల తయారీకి కావాల్సిన వాటిని అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటోంది...దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదంటూ ప్రశ్నించింది. మరోవైపు భారత్ తో ట్రంప్ వైఖరి పట్ల రష్యా కూడా స్పందించింది. ఆ దేశం ఇలా వత్తిడి తేవడం సమంజసం కాదంటూ భారత్ ను వెనకేసుకొచ్చింది. 

బలమైన దేశంతో సంబంధాలు దూరం చేసుకోవద్దు..

ఇదిలా ఉంటే భారత్ విషయంలో కఠినంగా వ్యవహరించొద్దు అంటూ ట్రంప్ కు సొంత పార్టీ నుంచే వార్నింగ్ వచ్చింది. ఆ పార్టీకి చెందిన భారత సంతతి నేత నిక్కీ హేలీ...ట్రంప్ ను హెచ్చరించారు. ఇండియా బలమైన దేశం...అలాంటి దానితో సంబంధాలను దెబ్బ తీసుకోకూడదని నిక్కీ అన్నారు. అలాగే చైనా గురించి కూడా ఆమె మాట్లాడారు. చైనా చమురు కొనుక్కుంటే తప్పు లేదు కానీ భారత్ రష్యా నుంచి దిగుమతి చేస్తే తప్పేంటని ఆమె ప్రశ్నించారు. రష్యా, ఇరాన్ ల నుంచి చైనా అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తోందని చెప్పారు.  ట్రంప్ అలాంటి దేశానికి మాత్రం 90 రోజుల మినహాయింపు ఇచ్చారని...భారత్ తో మాత్రం గొడవ పెట్టుకుంటున్నారని నిక్కీ విమర్శించారు. ట్రంప్ పద్దతి ఏం బాలేదని హెచ్చరించారు. భారత్‌ లాంటి బలమైన మిత్ర దేశంతో సంబంధాలను దూరం చేసుకోవద్దని నిక్కీ హేలీ సూచించారు. 

Advertisment
తాజా కథనాలు