/rtv/media/media_files/2025/11/15/fotojet-2025-11-15t180919-2025-11-15-18-09-56.jpg)
Dawood Ibrahim Drugs Party
Dawood Ibrahim Drugs Party: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఇప్పటికీ బాలీవుడ్‌ను శాసిస్తున్నాడా? అంటే అవుననే అంటున్నారు. పలువురు బాలీవుడ్ నటులు నేటికి దావూద్‌తో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలు గత చాలా కాలంగా వినపడుతున్నాయి. తాజాగా దావూద్ ఇబ్రహీం ఏర్పాటు చేసిన ఒక డ్రగ్ పార్టీల్లో బాలీవుడ్ తారలు పాల్గొన్నారన్న వార్త ఇప్పుడు దేశంలో సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసుల విచారణలో కీలక అంశాలు వెలుగు చూశాయి.
ఈ కేసుకు సంబంధించి ముంబై యాంటీ-నార్కోటిక్స్ సెల్(ANC) పోలీసుల విచారణలో కీలక అంశాలు వెలుగుచూశాయి. దావూద్ ఏర్పాటు చేసిన పలు డ్రగ్ పార్టీలకు బాలీవుడ్ తారలు నోరా ఫతేహి, శ్రద్ధా కపూర్ సహా ఆమె సోదరుడు సిద్ధార్థ్ కపూర్ హాజరైనట్లు తెలిసింది. ఈ మేరకు శ్రద్ధా కపూర్, నోరా ఫతేహికి ముంబై పోలీసులు నోటీసులు కూడా జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఓ చిత్రంలో శ్రద్ధా కపూర్ దావూద్ సోదరి పాత్రలో నటించింది. దావూద్ పాత్రలో ఆమె సోదరుడు సిద్ధార్థ్ కపూర్ యాక్ట్ చేశారు.
కాగా, రూ.250 కోట్ల డ్రగ్స్ సిండికేట్‌లో భాగమైన షేక్ తాహిర్ డోలాని ముంబై యాంటీ-నార్కోటిక్స్ సెల్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసి విచారించారు. ఈ విచారణలో సంచలన విషయాలు తెలుస్తున్నాయి. షేక్ తాహిర్ డోలా అతని తండ్రి అయిన సలీం డోలా.. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు దగ్గరి బంధువు. అయితే, తాహిర్‌ని దుబాయ్ నుంచి బహిష్కరించారు. దీంతో అతను భారత్ చేరుకుని మనదేశంతో పాటు పలు దేశాల్లో రేవ్, డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు తెలిసింది. దావూద్ నిర్వహించిన డగ్స్ పార్టీతో పాటు దేశ విదేశాల్లో నిర్వహించిన ఈ పార్టీలకు చాలా మంది బాలీవుడ్ తారలు, ఫ్యాషన్ రంగానికి చెందిన ప్రముఖులు హాజరైనట్లు విచారణలో తాహిర్ అంగీకరించినట్లు తెలుస్తోంది.
దీంతో శ్రద్ధా కపూర్, నోరా ఫతేహి సహా మరికొంతమందిని పోలీసులు విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, నిందితుడిపై మెఫెడ్రోన్ (ఎం-క్యాట్ లేదా మియావ్ మియావ్) అనే డ్రగ్ అమ్మకం- పంపిణీపై కేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడు ఈ విషయం సినీ ప్రపంచాన్ని కుదిపేసింది. మాఫియా డాన్లతో సినీ రంగ ప్రముఖులకు ఉన్న చీకటి సంబంధాలను ఈ కేసు వెలుగులోకి తెస్తుండడం సంచలనంగా మారింది.
Also Read : నీచుడు.. వైద్యం కోసం వచ్చిన మహిళ ప్రైవేట్ పార్ట్స్ తాకిన వైద్యుడు.. బయటపడ్డ వీడియో!
Also Read : నడిరోడ్డు మీద పట్టపగలు.. భార్య గొంతు కోసి దారుణంగా హత్య చేసిన భర్త.. కారణమేంటంటే?
Follow Us