/rtv/media/media_files/2025/06/14/wdliqXh5yLqOc2I6f7Cu.jpg)
Crime
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో దారుణం జరిగింది. తమ కూతురు అబ్బాయిలతో మాట్లాడుతుందని తల్లిదండ్రులు ఆమె గొంతు కోసి హత్య చేయడం కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ బాలిక తల్లిదండ్రులను అరెస్టు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. కాంతి అనే గ్రామానికి చెందిన సరిత(15) హత్యకు గురైంది. నవంబర్ 5 రాత్రి ఆ గ్రామంలో పొదల దగ్గర ఆమె మృతదేహం అక్కడి స్థానికులకు కనిపించింది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
Also Read: షాకింగ్ వీడియో: 150 అడుగుల లోయలో పడిపోయిన స్కూల్ బస్సు.. స్పాట్‌లో 30 మంది..!
ఆమెను గొంతుకోసి హత్య చేసినట్లు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. వాళ్ల తల్లిదండ్రులను విచారించారు. అయితే సరిత తండ్రి ముందుగా పోలీసులను తప్పుదారి పట్టించుకున్నప్పటికీ ఆ తర్వాత నిజాన్ని ఒప్పుకున్నాడు. ఆ గ్రామంలో తమ కూతరు అనేకమంది అబ్బాయిలతో సంబంధాలు కలిగి ఉందని ఆ కోపంతోనే ఈ హత్యకు పాల్పడ్డామని తెలిపాడు.
Also Read: పెళ్లి కాస్త విషాదం.. రోడ్డు ప్రమాదంలో 11 ఏళ్ల చిన్నారి సహా ముగ్గురు మృతి
నవంబర్ 5న రాత్రి సరితకు ఆమె తల్లి మత్తుమందు ఇచ్చిందని.. ఆ తర్వాత తన భార్యతో కలిసి కూతురును దూరంగా తీసుకెళ్లామని చెప్పాడు. అక్కడే తన కూతురును గొంతుకోసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తల్లిదండ్రులే సొంత కూతురుని హత్య చేయడం స్థానికంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
Follow Us