Telangana : ఎమ్మెల్యేలకు గుడ్ న్యూస్..ఒక్కొక్కరికి రూ.50 కోట్లు! నియోజకవర్గాల్లో మౌలిక సౌకర్యాలు ముఖ్యంగా రహదారులు నిర్మాణం.. పాతవి మరమ్మతు పనులపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి ఒక్కో ఎమ్మెల్యే రూ.50 కోట్ల చొప్పున ఇవ్వనున్నట్లు సమాచారం. By Bhavana 15 Nov 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి Telangana: రోడ్లు, భవనాల శాఖ పరిధిలో కొత్త రహదారుల నిర్మాణం, ఇతర పనులపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. నియోజకవర్గాల్లో అవసరమైన చోట రోడ్ల అభివృద్ధికి ఎమ్మెల్యేల నుంచి ఆర్ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపాలని అడిగారు. Also Read: నిజాం కూడా నీలాగా చేయలేదు.. అమోయ్ కుమార్ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు ఈ అంచనాలు రూ.50 కోట్లు మించకూడదని ముందే చెప్పినప్పటికీ.. పలువురు ఎమ్మెల్యేలు భారీ అంచనాలతో ప్రతిపాదనలు ఇస్తున్నారు. కొందరివి ఏకంగా రూ.200 కోట్లు దాటడం గమనార్హం. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ప్రతిపాదనలు రూ.180 కోట్లకు పంపగా.. వాటిని రూ.50 కోట్లకు తగ్గించి పంపించాలని అధికారులు అన్నారు. Also Read: AP Rains: అల్పపీడనం ప్రభావం.. ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! దీంతో ఆయన వాటిని సవరించి చివరకు రూ.70 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు.సెంట్రల్ రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్‌ఐఎఫ్) కింద రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, మరమ్మతులకు కేంద్రం రూ.900 కోట్లు ఇవ్వనుంది. వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉంది. ఒక్కో ఎమ్మెల్యే రూ.50 కోట్ల చొప్పున ప్రతిపాదనలు పంపితే.. మొత్తం కలిపి రూ.5 వేల కోట్లు దాటనున్నట్లు సమాచారం. Also Read: AP: విశాఖలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది..జమ్మూ నుంచి వచ్చి మరి యువతిని..! వాటికి కేంద్రం ఇచ్చే రూ.900 సీఆర్‌ఐఎఫ్ నిధులు ఏ మూలకూ చాలవు. పంచాయతీరాజ్, రహదారులు-భవనాల శాఖకు రూ.12 వేల కోట్లు మంజూరు చేయనున్నట్లు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.ఇందులో పంచాయతీరాజ్‌కు కేటాయించిన నిధులు పోనూ మిగిలిన వాటిని సీఆర్‌ఐఎఫ్‌తో కలిపి ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన రహదారుల నిర్మాణానికి ఇవ్వాలని అనుకుంటుంది. ఎమ్మెల్యేల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై డీపీఆర్‌లు సిద్ధం చేసి.. టెండర్లు పిలవడానికి అధికారులు కసరత్తు మొదలుపెట్టారు.ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లు, వంతెనలు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. Also Read: Bangladesh: రాజ్యాంగంలో ‘సెక్యులర్’, ‘సోషలిస్ట్’ పదాలు తొలగించండి...! వరదల వల్ల మొత్తం రూ.2,362 కోట్ల విలువ చేసే రహదారులు, బ్రిడ్జ్‌లు కొట్టుకుపోయినట్టు కేంద్రానికి రాష్ట్రం నివేదిక ఇచ్చింది. తక్షణ సాయంగా ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ కింద రాష్ట్రానికి రూ.416.80 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్రం గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. పూర్తిస్థాయిలో నివేదికలు అందిన తర్వాత వాటిని పరిశీలించి మిగతా నిధులు మంజూరు చేస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలతో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. కానీ, ఈ వివరాలు సరిపోవని, నిబంధనల ప్రకారం ఐదు పట్టికల్లో వివరాలు పంపాలని కేంద్రం సూచించినట్లు తెలుస్తోంది. #cm-revanth-reddy #roads repair fund #mlas #telangana mla fund for road repair మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి