Maoist Hidma : టార్గెట్‌ మావోయిస్టు హిడ్మా ...ఫొటో వైరల్‌

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా ఫొటో భారత భద్రతా దళాలకు చిక్కింది. 25 సంవత్సరాలుగా హిడ్మా ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. ఆయన పాత చిత్రాన్నే ఇన్నాళ్లు వినియోగిస్తూ వచ్చారు. మావోయిస్టు పార్టీలో భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా హిడ్మాకు పేరుంది.

New Update
Madvi Hidma

Madvi Hidma

Maoist Hidma : మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా ఫొటో భారత భద్రతా దళాలకు చిక్కింది. 25 సంవత్సరాలుగా హిడ్మా ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. ఆయన పాత చిత్రాన్నే ఇన్నాళ్లు వినియోగిస్తూ వచ్చారు. మావోయిస్టు పార్టీలో భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా హిడ్మాకు పేరుంది. అయితే అతను ప్రస్తుతం ఎలా ఉంటారనేది ఇప్పటివరకు బయటి ప్రపంచానికి తెలియలేదు.  ‘ఆపరేషన్‌ కగార్‌’ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఆపరేషన్‌ కగార్‌ అంతిమ దశకు చేరుకున్నదని ఆయన ప్రకటించారు. ఈ తరుణంలో హిడ్మా పోటో బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం నేషనల్‌ పార్కు్‌ దండకారణ్యంలో వేలాది మంది సాయుధ బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. 

Also Read : అఖిల్-జైనాబ్ పెళ్లి ఫొటోలు షేర్ చేసిన నాగార్జున

ఇప్పటికే మావోయిస్టు పార్టీ కీలక నేతలను కోల్పోయింది. పార్టీ అధినేత బస్వరాజు అలీయాస్‌ నంబాల కేశవరావు మృతి చెందాడు. నేషనల్‌ పార్కులో గురువారం కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్, శుక్రవారం తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు భాస్కర్‌ మరణించారు. కాగా PLGA ఒకటో బెటాలియన్ కమాండర్ గా కొనసాగుతున్న హిడ్మా నేషనల్‌ పార్కులోనే ఉన్నాడని భద్రతబలగాలు అనుమానిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర కమిటీ కూడా అక్కడే ఉందని నిఘావర్గాలు చెబుతున్నాయి.  ఇలాంటి పరిస్థితుల్లో హిడ్మా  ఫోటో బయటకు రావడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇది కూడా చదవండి:హైదరాబాద్‌లో జంట హత్యల కలకలం.. భార్య, భర్తను గొంతు కోసి!

హిడ్మా ప్రస్తుత వయస్సు 51 సంవత్సరాలు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మాకు పార్టీలో విలాస్, హిడ్మాల్, సంతోష్‌ అని పిలుస్తారు.  మురియా తెగకు చెందిన హిడ్మాకు హిందీ, గోండి, తెలుగు, కోయ, బెంగాలీ భాషలు తెలుసు. కేంద్ర బలగాల క్యాంపులపై మెరుపుదాడులు నిర్వహించడంలో నిష్ణాతుడు. కేంద్ర బలగాలకు మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్న హిడ్మాను తుదముట్టించే ఉద్దేశంతో నే  ఆయన పోటోను బహిర్గతం చేశారని పలువు అనుమానిస్తున్నారు.  

ఇది కూడా చదవండి:వాయు కాలుష్యంతో అనేక ప్రమాదాలు.. తెలుసుకుంటే షాక్ అవుతారు

Advertisment
తాజా కథనాలు