TN: వెయ్యి కిలోల ఆలయాల బంగారాన్ని కరిగించిన తమిళనాడు ప్రభుత్వం..ఎందుకో తెలుసా?

తమిళనాడు ప్రభుత్వం వెయ్యి కిలోల ఆలయ బంగారాన్ని కరిగింది. 21 ఆలయాలకు భక్తులు కానుకలుగా సమర్పించిన వాటిని ఇలా చేసింది. దీన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి.. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ప్లాన్ చేసింది. ఆ ఆదాయాన్ని కూడా తిరిగి ఆలయాలకే ఖర్చు పెడతామని చెబుతోంది.

New Update
tn

Temples gold

నిరుపయోగంగా ఉన్న వాటిపై తమిళనాడు ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆలయాల్లో ఉండిపోతున్న బంగారాన్ని కరిగించి ప్రభుత్వ ఖజానాను నింపుతోంది. ఇందులో భాగంగా తమిళనాడులో ఉన్న 21 ఆలయాల్లో బంగారాన్ని జమ చేసింది. ఇన్నీ ఆ గుడుల్లో భక్తులు కానుకలుగా సమర్పించినవి. ఇది మొత్తం 1000 కిలోలు ఉంది. ఈ మొత్తం బంగారాన్ని కరిగించి కడ్డీలుగా రూపొందించింది. వాటిని తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేసింది. దాన ద్వారా ఏటా రూ.17.81 కోట్లు వడ్డీ రూపంలో ఆదాయం వస్తుందని తమిళనాడు ప్రభుత్వం చెబుతోంది.  మొత్తం 21 టెంపుల్స్ లో అన్నింటికంటే తిరుచ్చిరాపల్లి జల్లాలోని మరియమ్మన్ గుడి నుంచి ఎక్కువగా 424 కేజీల బంగారం వచ్చిందని ప్రభుత్వం లెక్కలు చెప్పింది. 

తిరిగి ఆలయాల అభివృద్ధికే..

బంగారం ద్వారా వచ్చిన డబ్బును తిరిగి ఆలయాల అభివృద్ధికే ఖర్చు పెడతామని తమిళనాడు ప్రభుత్వం. ఈ మేరకు హిందూ మత, దేవాదాయ శాఖకు సంబంధించిన ఓ విధానపర పత్రాన్ని మంత్రి శేఖర్‌ బాబు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ పథకం అమలును పర్యవేక్షించేందుకు రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు ఒకరు చొప్పున ముగ్గురు రిటైర్డ్‌ న్యాయమూర్తులతో కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బంగారంతో పాటూ వెండి వస్తువులను కూడా కరిగించేందుకు అనుమతినిచ్చామని మంత్రి తెలిపారు. 

today-latest-news-in-telugu | tamilnadu | temples | gold | government 

Also Read: IPL 2025: వేడి పెంచుతున్న ఐపీఎల్..రసవత్తరంగా మ్యాచ్ లు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు