Retro Twitter Review: 'కంగువా' తర్వాత సూర్యకి హిట్టు పడిందా?.. రెట్రో ట్విట్టర్ రివ్యూ

ఈరోజు థియేటర్స్ లో విడుదలైన కోలీవుడ్ స్టార్ సూర్య 'రెట్రో' చిత్రానికి సూపర్ హిట్ టాక్ వస్తోంది. కార్తీక్ సుబ్బరాజు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని, ఫస్ట్ హాఫ్ సూర్య పర్ఫార్మెన్స్ పీక్స్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు.

New Update

కార్తీక్ సుబ్బరాజు- కోలీవుడ్ స్టార్ సూర్య కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'రెట్రో'. నేడు థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమాకు సూపర్ హిట్ రెస్పాన్  వినిపిస్తోంది. థియేటర్ నుంచి బయటకు వస్తున్న సూర్య  అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. సినిమాలో సూర్య స్క్రీన్ ప్రజెన్స్, పవర్ ప్యాకింగ్ పర్ఫార్మెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇంటర్వెల్ ఎండ్ పీక్స్ లో ఉండగా.. సాలిడ్ క్లైమాక్స్ తో కార్తీక్ సుబ్బరాజు పిచ్చెక్కించారని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక సినిమాలో పూజ, సూర్య కెమిస్ట్రీ, ఇతర నటీనటులు పర్ఫార్మెన్స్ లు మూవీకి మరో హైలైట్ గా నిలిచాయని చెబుతున్నారు. గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో సూర్య యాక్టింగ్ అబ్బురపరుస్తుంది. టైటిల్ ని జస్టిఫై చేసేలా యాక్షన్- రొమాన్స్‌ వంటి ఎలిమెంట్స్ లో  90's -స్టైల్ ఛాయలు కనిపిస్తాయి. ఇక సంతోష్ నారాయణన్ బీజీఎమ్ సీన్ ని మరింత ఎలివేట్ చేసేలా ఉందని అంటున్నారు. ఈ సినిమా గురించి నెటిజన్లు ఏమనుకుంటున్నారో ఇక్కడ చూడండి.. 

ట్విట్టర్ రివ్యూ

ఫస్ట్ హాఫ్ లో సూర్య పవర్ ప్యాకింగ్ పర్ఫార్మెన్స్, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్ అదిరిపోయాయని ఓ నెటిజన్ తన రివ్యూ పోస్ట్ చేశాడు. అలాగే సినిమాలో 'kanima' సాంగ్ సూపర్ అంటూ చెబుతున్నారు.  

మరో నెటిజన్.. సూర్య షో స్టీలర్.. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ లో కార్తీక్ సుబ్బరాజు సిగ్నేచర్ కనిపిస్తుంది. సూర్య కమ్ బ్యాక్ ఫిల్మ్ అంటూ కామెంట్ చేశాడు. 

మూవీ సూపర్ గా ఉంది.. ఫైట్స్, సంతోష్ నారాయణన్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంటూ చెబుతున్నారు. సూర్య యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్ పీక్స్ అని అంటున్నారు. 

మరో నెటిజన్.. Suriya’s is a nostalgic gem! గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో సూర్య యాక్టింగ్ అబ్బురపరుస్తుంది. టైటిల్ ని జస్టిఫై చేసేలా యాక్షన్- రొమాన్స్‌ వంటి ఎలిమెంట్స్ లో  90's -స్టైల్ ఛాయలు కనిపిస్తాయి, సినిమా సూపర్ అంటూ ట్వీట్ చేశాడు. అలాగే పూజ హెగ్డే  90's అమ్మాయిలా తన యాక్టింగ్ తో అదరగొట్టేసింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు