/rtv/media/media_files/2025/04/09/39bDzCsrKmcYrsjOV2sJ.jpg)
Surendra Mehta Rug Distribution
Surendra Mehta : అసలే వేసవికాలం దేశమంతా ఎండలు మండిపోతున్నాయి..ఎప్రిల్ నెలలోనే 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు రాష్ట్రాలు, నగరాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేయడమే కాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి. నదీ జలాలు అడుగంటుతున్నాయి. ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడం కోసం చాలా మంది చల్లని తాగు నీరు, అంబలి, మజ్జిగ వంటి వాటిని పంచుతారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మంత్రి మాత్రం అందరికి భిన్నంగా ఉండాలని ఆలోచించి..విమర్శల పాలయ్యాడు.
Also Read: TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!
ఎప్రిల్ నెల మండుటెండల్లో.. రగ్గులు పంపణీ చేసి వార్తల్లో నిలిచాడు ఓ మంత్రి. ఇందుకు సంబంధంచిన వీడియో తెగ వైరల్ కావడంతో.. నెటిజనులు, ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ సంఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర స్పోర్ట్స్ మినిస్టర్ సురేంద్ర మెహతా.. మండుటెండల్లో.. పేదలకు రగ్గులు పంపిణీ చేసి వార్తల్లో నిలిచాడు. బఛ్వారా అసెంబ్లీ నియోజకవర్గంలోని అహియాపూర్ గ్రామంలోని సుమారు 500 మంది పేదలకు రగ్గులు పంచి నవ్వుల పాలయ్యాడు.
బీజేపీ 46వ సంస్థాపన దినోత్సవం సందర్భంగా సురేంద్ర మెహతా ఈ కార్యక్రమం చేపట్టాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అయ్యింది. భారీ ఎత్తున ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినట్లు తెలుస్తోంది. మీటింగ్‌కు వచ్చిన వందలాది మందికి మినిస్టర్ మెహతా, బీజేపీ కార్యకర్తలు రగ్గులు పంచారు.అయితే వారు మంచి ఉద్దేశంతో చేసినా సరే.. ఇది సరైన సమయం కాకపోవడంతో.. నెటిజనులు విమర్శలు చేస్తున్నారు. మండుటెండల్లో రగ్గులు ఎవడు కప్పుకుంటారు సార్.. మీకి ఆలోచన ఎలా వచ్చింది.. మీ తెలివికి జోహార్లు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు.
Also Read: Mujra Party : మొయినాబాద్‌లో ముజ్రా పార్టీ భగ్నం..ఏడుగురు అమ్మాయిలు అరెస్ట్!
సురేంద్ర మెహతా చేసిన పనిపై విపక్షాలు సైతం విమర్శలు చేస్తున్నాయి. ఇది ఓ రాజకీయ స్టంట్ అని జనాలకు కూడా అర్థం అయ్యింది. ప్రజలను పిచ్చి వాళ్లని చేద్దామని భావించి.. మీరే ఫుల్స్ అయ్యారు. ఇంత లాజిక్‌లెస్‌గా ఎలా ఉన్నారంటూ సీపీఐ నేత ఒకరు దుమ్మెత్తి పోశాడు. సురేంద్ర మెహతా.. రగ్గుల పంపిణీ బదులు.. రాష్ట్రంలో ప్లేగ్రౌండ్స్, క్రీడా సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారిస్తే బాగుండేది అంటూ విమర్శలు చేశాడు.
ఇది కూడా చదవండి: అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. తొలి విడత కింద రూ.4285 కోట్లు రిలీజ్