అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. తొలి విడత కింద రూ.4285 కోట్లు రిలీజ్

ఏపీలోని అమరావతి రాజధాని నిర్మాణం కోసం కేంద్రం రూ.4,285 కోట్ల నిధులను విడుదల చేశాయి. మొదట విడత కింద ప్రపంచ బ్యాంకు నుంచి రిలీజ్ చేసింది. నిధులు రిలీజ్ కావడంతో త్వరలోనే అమరావతి పనులు పునఃప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

New Update
chandrababu.

chandrababu

అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. ఏపీలోని అమరావతి రాజధాని నిర్మాణం కోసం గతంలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ సహా వివిధ సంస్థల నుంచి తీసుకునే రూ.15 వేల కోట్ల రుణాలకు గ్యారెంటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇందులో భాగంగా మొదట విడత కింద కేంద్రం నిధులు విడుదల చేసింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వానికి రూ.4,285 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది.

ఇది కూడా చూడండి:Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

ఇది కూడా చూడండి:Today Gold Rate: కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?

ప్రపంచ బ్యాంక్ రుణంలో భాగంగా..

ప్రపంచ బ్యాంకు నుండి మొదటి విడతగా 205 మిలియన్ డాలర్లను అందుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు రూ.4285 కోట్ల నిధుల్ని విడుదల చేసింది. పంచ బ్యాంక్ రుణంలో భాగంగా ఈ నిధుల విడుదలయ్యాయి. నిధులు రిలీజ్ కావడంతో త్వరలోనే అమరావతి పనులు పునఃప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి:Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

అమరావతి రాజధాని నగరంలో ఫేజ్1 అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు కలిసి 1600 మిలియన్ డాలర్లు అనగా రూ.13,600 కోట్ల నిధులు గతంలో ఇచ్చేందుకు అంగీకరించాయి. వీటిలో ఒక్కో బ్యాంక్ 800 మిలియన్ డాలర్ల మేర నిధులు ఇవ్వడానికి ఒప్పుకున్నాయి. 

ఇది కూడా చూడండి:Telangana: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

Advertisment
తాజా కథనాలు