Fighter Jet Crash: వరుసపెట్టి కూలిపోతున్న యూఎస్ ఫైటర్ జెట్ లు..వర్జీనియా తీరంలో మరొకటి..

బుధవారం అమెరికాలోని వర్జీనియా తీరంలో అమెరికా సైన్యానికి చెంతని ఎఫ్ 18 ఫైటర్ జెట్ ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి ముందే పైలెట్ దూకేయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. గత పది నెలల్లో F-18 జెట్‌ను కోల్పోవడం ఇది ఆరోసారని చెబుతున్నారు. 

New Update
F 18

F-18 Fighter Jet Crashed In USA

అమెరికాలో నిన్న మరో విమాన ప్రమాదం జరిగింది. ఉదయం 9.53 ప్రాంతంలో ఎఫ్ 18 ఫైటర్ జెట్ సముద్రంలో కూలిపోయింది. వర్జీనియా ప్రాంతంలో ఇది పడపోయింది. అయితే పైలెట్ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి దూకేయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. జెట్ కూలిపోయి వర్జీనియా సముద్రంలో పడిపోయింది. పైలెట్ కూడా అందులోనే పడిపోయారు. నావల్ ఎయిర్ స్టేషన్ ఓషియానా సెర్చ్ అండ్ రెస్క్యూ సిబ్బంది పైలెట్ ను కాపాడి సురక్షితంగా ఒడ్డుకు తీసుకుని వచ్చారు. 

ఇది ఆరోసారి..

గత పది నెల్లో అమెరికాకు చెందిన ఎఫ్ 18 ఫైటర్ జెట్లు ప్రమాదానికి గుర్వడం ఇది ఆరవసారని చెబుతున్నారు. ఒక్కో F/A-18E సూపర్ హార్నెట్ ధర $67 మిలియన్లు ఉంటుందని తెలిపారు.  నిన్న పడిపోయిన విమానాన్ని స్ట్రైక్ ఫైటర్ స్క్వాడ్రన్ 83 పైలట్ బ్యాచ్ కు చెందిన పైలెట్ ఒకరు నడిపారని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని..కోలుకున్నాక ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటామని నేవీ అధికారులు తెలిపారు. జెట్ ఇంకా సముద్రంలోనే ఉందని...దానిని కూడా రెస్క్యూ చేసి మరిన్ని వివరాలను తెలుసుకుంటామని అన్నారు. 

Also Read: India-Russia-China: ట్రంప్ కు దిమ్మ తిరిగే షాక్..కలిసి కొట్టడానికి రెడీ వుతున్న భారత్, రష్యా, చైనా

Advertisment
తాజా కథనాలు