/rtv/media/media_files/2025/05/06/rEde9oQ14wvhdA1mPlwj.jpg)
redfort
ఢిల్లీలోని అత్యంత ప్రసిద్ధ చారిత్రక కట్టడాలలో ఒకటైన 17వ శతాబ్దపు ఎర్రకోటను తమకు అప్పగించాలంటూ చివరి మొఘల్ పాలకుడు బహదూర్ షా జాఫర్-II మునిమనవడు భార్య సుల్తానా బేగం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. తాను మొఘలుల వారసుడి భార్యనని, ఎర్రకోట తనకు ఇప్పించాలని కోరుతూ సుల్తానా బేగమ్ అనే మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. మొఘల్ పాలకుడు బహదూర్ షా జాఫర్ కు తన దివంగత భర్త మహ్మద్ బీదర్ బఖ్త వారసుడని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు.
Also read : Miss World Competition : మిస్ వరల్డ్ పోటీలు..మన దేశం నుంచి పాల్గొనే అందాల భామ ఎవరంటే?
ఎర్రకోట మాత్రమే ఎందుకు?
ఆ పిటిషన్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా తప్పుబట్టారు. 'ఎర్రకోట మాత్రమే ఎందుకు? ఫతేపూర్ సిక్రీ, తాజ్మహల్ వంటివి ఎందుకు వదిలేశారు?' అని ప్రశ్నిస్తూ ఆ పిటిషన్ ను కొట్టివేశారు. ప్రత్యామ్నాయంగా ఆమె కేంద్ర ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం కోరింది. అయితే ఈ విషయంలో ఆమె 2021లో ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించారు.
అయితే ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. 164 ఏళ్లుగా ఆ ప్రాపర్టీ ఇతరుల ఆధీనంలో ఉందని తెలిసి ఇన్నాళ్లూ ఎందుకు జాప్యం చేసినట్లు సింగిల్ జడ్జీ ప్రశ్నించారు. కేసు ఫైల్ చేయడంలో తీవ్ర ఆలస్యమైనట్లు హైకోర్టు అప్పట్లోనే పేర్కొంది. కాగా సుల్తానా బేగం ప్రస్తుతం కోల్‌కతా సమీపంలోని హౌరాలో నివసిస్తున్నారు.
Also read : సుజనా చౌదరికి తీవ్ర గాయం..హైదరాబాద్కు తరలింపు!
supreme-court | red-fort | india | new-delhi | telugu-news