Caste reservations : రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు జడ్జి సంచలన వ్యాఖ్యలు...రైలు బోగీతో  పోల్చుతూ...

మనదేశంలో కుల ఆధారిత రిజర్వేషన్ రైలు కంపార్ట్‌ మెంట్‌లా మారిపోయిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ సంచలన ఆరోపణలు చేశారు. రిజర్వేషన్లను రైలు బోగీతో పోల్చిన ఆయన. ఒకసారి బోగీలోకి ప్రవేశించిన వారు ఇతరులు ఆ బోగీలోకి రావడానికి ఇష్టపడటంలేదన్నారు.

author-image
By Madhukar Vydhyula
New Update
Supreme Court

Supreme Court

Caste reservations : భారత దేశంలో కుల ఆధారిత రిజర్వేషన్ రైలు కంపార్ట్‌ మెంట్‌లా మారిపోయిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ సంచలన ఆరోపణలు చేశారు. రిజర్వేషన్లను రైలు బోగీతో పోల్చిన ఆయన . రిజర్వేషన్ వ్యవస్థ రైలు కంపార్ట్‌మెంట్‌లా మారిపోయిందని, ఒకసారి బోగీలోకి ప్రవేశించిన వారు ఇతరులు ఆ బోగీలోకి రావడానికి ఇష్టపడటంలేదని అన్నారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) రిజర్వేషన్లకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు చివరిసారిగా 2016-17లో జరిగాయి. ఓబీసీ కోటాకు సంబంధించిన రిజర్వేషన్ల పై సాగుతున్న న్యాయ పోరాటం కారణంగానే ఎన్నికల నిర్వహణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ క్రమంలో కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.కాగా, జస్టిస్ సూర్యకాంత్ ఈ ఏడాది చివర్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు.  

ఇది కూడా చూడండి: VIRAL VIDEO: వెడ్డింగ్ షూట్‌లో విషాదం.. వధువుపై పేలిన బాంబు.. వీడియో వైరల్

Also Read :  సుజనా చౌదరికి తీవ్ర గాయం..హైదరాబాద్కు తరలింపు!

 2021లో, ఓబీసీలకు 27 శాతం కోటా అమలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం అర్టినెన్స్‌ జారీ చేసింది. అయితే దీనిపై కొన్ని ఓబీసీ కులాలు న్యాయపోరాటానికి దిగడంతో ఆ ఆర్డినెన్స్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. స్థానిక సంస్థల్లో వెనుకబాటుతనంపై కచ్చితమైన గణాంకాల సేకరణకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు, కమిషన్ సిఫార్సుల మేరకు రిజర్వేషన్ల శాతం నిర్ధారణ, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ రిజర్వేషన్లు మొత్తం 50 శాతానికి మించరాదనే త్రివిధ సూత్రాన్ని అత్యున్నత న్యాయస్థానం నిర్దేశించింది. అప్పటి నుంచి గణాంకాల సేకరణ, సంబంధిత వ్యాజ్యాల వల్ల ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. న్యాయమూర్తులు మారినా, తీర్పుల విషయంలో మాత్రం ఎలాంటి పురోగతి సాధించడం లేదు. దీంతో గడచిన 9 ఏండ్లుగా మహారాష్ర్టలో స్థానిక ఎన్నికలు వాయిదా పడుతూనే ఉన్నాయి.

Also Read :  TGSRTC : ఆర్టీసీ సమ్మె... ఉద్యోగులను బెదిరిస్తే..అంతే సంగతులు సిబ్బందికి యాజమాన్యం బహిరంగ లేఖ...

కాగా ఈ రోజు పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది ఇందిరా జైసింగ్, ఓబీసీలను గుర్తించినప్పటికీ, ఆ డేటాను స్థానిక ఎన్నికలకు మహారాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించడం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఎన్నికలను త్వరగా నిర్వహించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన ఆమె, రాష్ట్ర ప్రభుత్వం తమకు అనుకూలమైన అధికారుల ద్వారా స్థానిక సంస్థలను ఏకపక్షంగా నడిపిస్తోందని ఆరోపించారు. దీనిపై తీర్పును సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది.

Also read :  Indian Idol : ఇండియన్ ఐడల్ సీజన్-12 విజేత పవన్‎దీప్ రాజన్ కు ఘోరప్రమాదం...పరిస్థితి విషమం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు