Supreme Court: SIRపై రాష్ట్రాల పిటిషన్.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా SIR ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తగిన ఆధారాలు లభిస్తే ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ గడువు పొడిగించాలని ECని ఆదేశిస్తామంది.

New Update
Supreme Court

Supreme Court

పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా 'ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (SIR)' ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో తగిన ఆధారాలు లభిస్తే ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ గడువును పొడిగించాలని భారత ఎన్నికల సంఘాన్ని ఆదేశించగలమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ కమిటీ, తమిళనాడులోని డీఎంకే తదితర పార్టీలు దాఖలు చేసిన ఈ పిటిషన్లపై న్యాయమూర్తులు సూర్య కాంత్, జస్టిస్ జాయ్‌మల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. SIR ప్రక్రియ రాజ్యాంగ చెల్లుబాటు, సమయపాలనపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తక్కువ సమయంలో, వర్షాలు, పండుగ సీజన్ల మధ్య ఈ సవరణ చేపట్టడం వల్ల లక్షలాది మంది అర్హులైన ఓటర్లు జాబితా నుంచి తొలగిపోయే ప్రమాదం ఉందని వారు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

Also Read :  నేడే రాజ్యాంగ దినోత్సవం.. ప్రతి భారతీయుడి ఆత్మవిశ్వాసం, ఆశయాల సంకేతం!

Supreme Court Directs West Bengal SEC

ఈసీఐ తరఫున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల ప్రక్రియ సక్రమంగా నిర్వహించేందుకు రాజ్యాంగ సంస్థగా ఈసీఐకి అధికారం ఉందని, విధానపరమైన లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉంటుందని తెలిపారు. అయితే, ఈ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, తొలగించిన ఓటర్ల వివరాలు బహిరంగంగా ఉంచడం లేదని పిటిషనర్లు ఆరోపించారు.

Also Read :  10 అడుగుల భూగర్భంలో మదర్సా..ఉగ్రవాది ముజమ్మిల్ ప్లాన్ ఏంటి? దీని వెనుక రహస్యం ఏంటి?

దీనిపై స్పందించిన ధర్మాసనం, రాష్ట్రాల్లోని ఉన్నత న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న ఇలాంటి పిటిషన్లపై తదుపరి విచారణను నిలిపివేయాలని ఆదేశించింది. తుది నిర్ణయం తీసుకునే వరకు ఈసీఐకి రెండు వారాల గడువు ఇచ్చి, ఈ అంశంపై వివరణాత్మక కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. న్యాయం కోసం గట్టి ఆధారాలు చూపగలిగితే, ముసాయిదా జాబితాల ప్రచురణ తేదీని పొడిగించాలని ఆదేశించడంలో వెనుకాడబోమని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణను డిసెంబర్ 9కి వాయిదా వేసింది. ఈ తీర్పు, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పౌరుల హక్కులు, పారదర్శకతపై సుప్రీంకోర్టుకున్న నిబద్ధతను తెలియజేస్తోంది. - nationwide Special Intensive Revision

Advertisment
తాజా కథనాలు