/rtv/media/media_files/2025/11/26/madarasa-2025-11-26-09-21-14.jpg)
ఢిల్లీ పేలుళ్ల కేసుకు ఫరీదాబాద్ కు ఉన్న లింకులు గురించి అందరికీ తెలిసిందే. ఇక్కడే మొదలైన వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ ఢిల్లీ పేలుళ్లకు కారణమైంది. ఈ క్రమంలో ఆరుగురు ఉగ్రవాదులు పట్టుబడ్డారు. వీరందరూ డాక్టరే కావడం గమనార్హం. అయితే వీరందరినీ ఇందులోకి లాక్కొచ్చింది ,ఇక మత గురువు అన్న విషయం కూడా బయటపడింది. తాజగా ఈ కేసులో ఒక మదర్సా కూడా ఉన్న లింకు బయటపడింది. దీనిని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయం నుండి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న 200 గజాల స్థలంలో నిర్మిస్తున్నారు. బయటకు అంతా మామూలుగానే కనిపిస్తున్నా..దగ్గరకు వెళ్ళి చూస్తే అసలు విషయం బయటపడింది. ఈ మదరసాను నేల మట్టానికి దాదాపు పది అడుగుల లోతులో నిర్మిస్తున్నారు. దీంతో దర్యాప్తు సంస్థలకు అనుమానం మొదలైంది.
నేల అడుగున మదర్సా..
ఫరీదాబాద్ లో ఉన్న మదర్సా బయట నుంచి చూస్తే ఓ నిర్మాణం లో ఉన్న కట్టడంలో కనిపిస్తుంది. ఐదడుగుల మందం వరకు ఉన్న మందపాటి కాంక్రీట్ గోడలు దర్శనమిస్తాయి. కానీ దగ్గరకు వెళ్ళి చూస్తే..లోపల , అడుగున ఫ్యాన్లు, మాట్స్, సీటింగ్ అన్నీ అమర్చి కనిపిస్తాయి. అంటే ఈ మదర్సా అందరికీ అందుబాటులో ఉందని అర్థం అవుతుంది. ఇక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇది మౌల్విఇష్తాక్ పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. కానీ దీనికి సంబంధించిన నిధులు మాత్రం పూర్తిగా డాక్టర్ ముజమ్మిల్, ఉగ్రవాది సమకూర్చారు. ఢిల్లీ బాంబు దాడుల మాడ్యూల్‌కు సంబంధించి డాక్టర్ ముజమ్మిల్ పేరు బయటపడటంతో ఈ వాస్తవం దర్యాప్తును మరింత తీవ్రమైన మలుపు తిప్పింది. దీంతో ఢిల్లీ బాంబు పేలుళ్ల కేసుకు, ఈ మదర్సాకు ఉన్న సంబంధంపై దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి.
ఇది ఒక మాడ్యూలేనా?
ఉగ్రవాదానికి సంబంధించి ఈ మదర్సా ఒక వ్యవస్థీకృత మాడ్యూల్ కావచ్చని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. దీంతో భూగర్భ నిర్మాణాన్ని ఎప్పుడు ప్లాన్ చేశారు, ఎవరు దీనిని రూపొందించారు, నిర్మాణ సామగ్రిని ఎక్కడ నుండి సేకరించారు మరియు ఇంత బలమైన అంతర్గత నిర్మాణం ఎందుకు నిర్మించారుభూగర్భ నిర్మాణాన్ని ఎప్పుడు ప్లాన్ చేశారు, ఎవరు దీనిని రూపొందించారు, నిర్మాణ సామగ్రిని ఎక్కడ నుండి సేకరించారు, ఇంత బలమైన అంతర్గత నిర్మాణం ఎందుకు నిర్మించారు అనే దానిపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది. ఇది కేవలం మతపరమైన ప్రదేశమే కాకుండా రహస్య కార్యకలాపాల కేంద్రంగా కూడా ఉండొచ్చని అంటున్నారు. నవంబర్ 24, 2025న, NIA బృందం, ప్రత్యేక భద్రతలో, డాక్టర్ ముజమ్మిల్‌తో కలిసి ఫరీదాబాద్‌కు చేరుకుంది. ఆ బృందం మదర్సాను తనిఖీ చేయడమే కాకుండా, అతన్ని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయానికి , దాంతో పాటూ అతను బస చేసిన ఇంటికి కూడా తీసుకెళ్లి దర్యాప్తు నిర్వహించింది.
మరో విస్తుపోయే నిజం..
ఇదిలా ఉంటే ఢిల్లీ పేళ్ళ ప్రధాన నిందితుడు అయిన డాక్టర్ ఉమర్ నబీకి సంబంధించి మరో విస్తు పోయే నిజం బయటపడింది. ఉగ్రవాదం, పేలుళ్లకు ఉపయోగించే పరికరాలను తయారు చేసుకునేందుకు ఒక రహస్య ‘మొబైల్ వర్క్‌స్టేషన్’ అతడితో ఉండేదని ఫరీదాబాద్‌లో పట్టుబడిన ‘వైట్ కాలర్’ టెర్రర్ మాడ్యూల్ నిందితులు విచారణలో చెప్పారు. డాక్టర్ ఉమర్ ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీలోని తన గదిలోనే ఐఈడీ తయారీలో ఉపయోగించిన రసాయన మిశ్రమాన్ని చిన్నపరీక్షగా తయారు చేసి పరీక్షించాడని ఉగ్రవాది ముజమ్మిల్ చెప్పాడు. ఉమర్ ఓ సూట్‌కేస్‌ను ‘మొబైల్ వర్క్‌స్టేషన్’గా మార్చుకుని, ఎక్కడకు వెళ్లినా దానిని తన వెంట తీసుకెళ్లేవాడనిఎన్ఐఏ వర్గాలు చెప్పాయి. అందులోనే బాంబు తయారీకి అవసరమైన రసాయనాలు, పరికరాలను స్టోర్ చేసినట్టు తెలిపాయి. అతడి సూట్‌కేసులో పోలీసులకు లభించిన బాంబు తయారీ సామాగ్రితో ఇది మరింత నిర్దారణ అయ్యింది. ఢిల్లీ పేలుడుకు సగం తయారుచేసిన ఐఈడీనే ఉమర్ వినియోగించినట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు.
Follow Us