Madhya Pradesh: వీధికుక్క నోట్లో అప్పుడే పుట్టిన పసికందు.. 45 రోజుల్లో మూడో ఘటన

మధ్యప్రదేశ్‌ లో అప్పుడే పుట్టిన పసికందును ఓ వీధి కుక్క ఎత్తుకెళ్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రాత్రి వేళ.. ఓ కుక్క వీధుల్లో పరుగులు పెడుతుండగా.. దాని నోట్లో అప్పుడే పుట్టిన పసికందు కనిపించింది.

New Update
dog baby

dog baby

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఓ పసిబిడ్డ శవాన్ని.. ఓ వీధి కుక్క (Stray Dog) నోట్లో పెట్టుకుని.. వీధుల్లో పరిగెత్తుతున్న దృశ్యాలను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తీవ్ర సంచలనంగా మారింది. రాత్రి వేళ.. ఓ కుక్క వీధుల్లో పరుగులు పెడుతుండగా.. దాని నోట్లో అప్పుడే పుట్టిన పసికందు కనిపించింది. 

Also Read:  America: విమానంలో చెలరేగిన మంటలు..ప్రయాణికులు రెక్కలపై నిల్చుని!

అది చూసిన కొందరు యువత బైక్‌పై ఆ కుక్కవెంటపడి వీడియో తీశారు. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయితే గత నెలన్నర రోజులుగా ఇలాంటి సంఘటనలు 3 జరిగినట్లు అధికారులు పేర్కొనడం మరింత వివాదానికి  కారణం అయ్యింది.మధ్యప్రదేశ్‌ రేవా జిల్లాలో ఈ అమానవీయ ఘటన జరిగింది. ఈనెల 11వ తేదీన రాత్రి పూట.. నగరంలో ఉన్న జయస్తంభ్ చౌక్ వద్ద.. ఒక నవజాత శిశువు మృతదేహాన్ని వీధి కుక్క నోటకరుచుకెళ్లింది. 

Also Read: Kerala: పాలక్కాడ్‌లో అత్యధిక స్థాయిలో అతినీలలోహిత కిరణాలు...రెడ్‌ అలర్ట్‌!

Stray Dog Carrying Newborn

అయితే ఆ శిశువు (New Born) మరణించినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పసికందు శవాన్ని నోటపెట్టుకుని.. ఆ వీధి కుక్క వీధుల్లో పరిగెత్తుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు స్పందించారు. ఈ నేపథ్యంలోనే ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

ఇక ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో రేవా జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఒకరు స్పందించారు. గత నెలన్నర రోజుల్లో ఇలాంటి సంఘటనలు 3 జరిగినట్లు తెలిపారు. ఇలాంటి నవజాత శిశువుల మృతదేహాలు ఎవరు పడేస్తున్నారో అనేదానిపై తాము దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. 

ఇలాంటి ఘటనలు ఎవరికైనా తెలిస్తే.. పోలీసులకు చెప్పాలని విజ్ఞప్తి చేశారు. అలాంటి సమాచారం ఇచ్చిన వారి వివరాలను రహస్యంగా ఉంచాలని చెప్పారు.మరోవైపు.. ఆ వైరల్ వీడియో క్లిప్‌పై కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటం పట్ల రేవా నగర వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఎంత బలుపురా.. మద్యం మత్తులో100 స్పీడ్తో కారు నడిపి.. మహిళ స్పాట్ డెడ్

Also Read: Tirumala: తిరుపతి భక్తులకు అలర్ట్.. దర్శనం పేరుతో మోసాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు