ఈమధ్య ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు అస్వస్థకు గురవుతున్న ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో కోడిగుడ్డు ధర రూ.7 ఉండగా.. ప్రభుత్వం కేవలం రూ.5 చొప్పున చెల్లిస్తోంది. ఈ విషయాలను తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. గత రెండు నుంచి నాలుగు నెలలుగా బిల్లులు పెండింగ్లో ఉంటున్నాయని.. గుడ్డ ధర పెంచడంతో పాటు వంట ఏజెన్సీ మహిళలకు సకాలంలో బిల్లులు చెల్లించాలని సిఫార్సు చేయనున్నట్లు తెలుస్తోంది. Also Read: కేవలం 3 రోజుల్లో రూ.5.5 లక్షల నష్టం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు, గురుకులాల్లో భోజనం పరిస్థితిపై సిఫార్సులతో రూపొందించిన రిపోర్టును మరో 4,5 రోజుల్లో కమిషన్ ప్రభుత్వం అందజేయనున్నట్లు తెలుస్తోంది. అయితే విద్యాశాఖ కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు ఆచార్య పీఎల్ విశ్వేశ్వర్‌రావు తదితురులు డిసెంబర్ 8వ తేదీ వరకు వేర్వేరుగా అన్ని జిల్లాల్లో పర్యటించారు. ప్రభుత్వ స్కూల్స్, కేజీబీవీలు, గురుకులాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను గుర్తించారు. గత రెండ్రోజులుగా ఆయా గురుకులాల కార్యదర్శులతో సమావేశమై అభిప్రాయాలు తీసుకున్నారు. క్షేత్రస్థాయి సమస్యలు ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో క్షేత్రస్థాయి సమస్యలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో మొత్తం 26,319 ప్రభుత్వ పాఠశాలల్లో 20.36 లక్షల మందికి మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. ఈ స్కీమ్ కింద వారానికి మూడుసార్లు కోడిగుడ్డు అందజేయాల్సి ఉండగా.. ఎక్కువ శాతం స్కూళ్లలో కేవలం రెండుసార్లు మాత్రమే ఇస్తున్నారు. మార్కెట్లో కోడిగుడ్డ ధర రూ.7 ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.5 మాత్రమే చెల్లిస్తోంది. Also Read: CM సీటుకు వాస్తు గండం..! KCR, రేవంత్, జగన్, CBNల ట్రాక్‌లు ఇవే వంట చేసే మహిళలకు డిసెంబర్1 నుంచి 1-5 తరగతుల విద్యార్థులకు రూ.6.19 చొప్పున, 6-10 తరగతుల విద్యార్థులకు రూ.9.29 చొప్పున చెల్లిస్తున్నారు. పౌరసరఫరాల శాఖ సన్నబియ్యాన్ని అందజేస్తోంది. కానీ వంట ఏజెన్సీ మహిళలకు బిల్లులు రావడం ఆలస్యమవుతున్నాయి. సకాలంలో బిల్లులు అందక అప్పులు చేసి వంట సరకులు తెసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. మధ్యాహ్న భోజనం వంటపై ఎలాంటి పర్యవేక్షణ ఉండటం లేదు. కొన్నిచోట్ల వంట గదులు కూడా లేవు. ఎక్కుడగా బడి ప్రాంగణంలో ఏదోఒక చోట మాత్రమే వండుతున్నారు. పరిశుభ్రత కూడా ఉండటం లేదు. Also Read: ఢిల్లీ ఎన్నికలు.. కాంగ్రెస్‌తో పొత్తుపై మరోసారి క్లారిటీ ఇచ్చిన కేజ్రీవాల్ వాస్తవానికి వంట ఏజెన్సీ మహిళలకు 1-8 తరగతులకు సరకులు, కోడిగుడ్లు అలాగే 9,10 తరగతులకు సరకులు, కోడిగుడ్లు అని నాలుగు పద్దుల పేరిట బిల్లులు వస్తాయి. కానీ ఇన్నీ ఒకేసారి రావడం లేదు. ఎప్పుడేమి వస్తున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. 1-8 తరగతుల వరకు అయ్యే వంట ఖర్చులో 60 శాతం కేంద్రం నుంచే నిధులు వస్తాయి. ఇక 9,10 తరగతులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే 100 శాతం భరిస్తోంది. అందుకే వివిధ రకాల పద్దుల ద్వారా బిల్లులు ఇస్తున్నారు. Also Read: ఆత్మహత్యకు ముందు స్నానం..వందసార్లు శివనామస్మరణ