Eknath Shinde: అలా చేస్తే మీ పార్టీలో ఇద్దరు ఎమ్మెల్యేలే ఉంటారు : ఏక్‌నాథ్ షిండే

శివసేన (UBT) పార్టీపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాయుతి కూటమిపై విమర్శలు చేయడం మానకపోతే ఆ పార్టీలో ఉన్న 20 మంది ఎమ్మెల్యేల్లో చివరికి ఇద్దరే మిగులుతారని అన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Eknath Shinde

Eknath Shinde

శివసేన (UBT) పార్టీపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాయుతి కూటమిపై విమర్శలు చేయడం మానకపోతే ఆ పార్టీలో ఉన్న 20 మంది ఎమ్మెల్యేల్లో చివరికి ఇద్దరే మిగులుతారని అన్నారు. తాజాగా మీడియాతో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. షిండే మాట్లాడుతూ '' మొదటి నుంచి కూడా నన్ను, మహాయుతిని శివసేన (UBT) పార్టీ విమర్శలు చేస్తూనే ఉంది. కానీ దీనివల్ల వాళ్లకి ఎలాంటి ప్రయోజనం జరగలేదు. 

Also Read: భార్యను కుక్కర్‌లో ఉడికించిన ఘటన.. గురుమూర్తి సెల్‌ఫోన్‌లో సంచలన విషయం

గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు వారికి బుద్ధి చెప్పారు. వాళ్లకి తమ స్థాయి ఏంటో గుర్తుచేశారు. ఓటమిపై వాళ్లు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరు ఇలానే విమర్శలు చేస్తూనే ఉంటే.. ప్రస్తుతం ఉన్న 20 మంది ఎమ్మెల్యేల్లో కేవలం ఇద్దరే మిగులుతారు. ఇటీవలే విపక్ష పార్టీల నుంచి చాలామంది నేతలు, కార్యకర్తలు మా పార్టీలో చేరారు. ఇది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. 

Also Read: హైదరాబాద్‌ కిడ్నీ రాకేట్‌ వ్యవహారం.. వెలుగులోకి సంచలన విషయాలు

మహారాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా శివసేనకు ప్రజాదారణ పెరుగుతోంది. మా పార్టీ రోజురోజుకు ఎదుగుతోంది. త్వరలోనే వేరే రాష్ట్రాల్లో కూడా శివసేనను ప్రారంభిస్తామని'' ఏక్‌నాథ్ షిండే అన్నారు. ఇదిలాఉండగా.. ఇటీవల మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసందే. ఈ ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలవగా మహా వికాస్ అఘాడి ఘోరంగా పరాజయం పొందింది. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌.. డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్‌ పవార్‌లు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. 

Also Read: ఐదేళ్లలో నిరుద్యోగం లేకుండా చేస్తా.. కేజ్రీవాల్ సంచలన హామీ

Also Read: ట్రంప్‌ నిర్ణయంతో అమెరికాలో హాస్పిటళ్లకు క్యూ కడుతున్న ఇండియన్స్

Advertisment
తాజా కథనాలు