IPL Matches: ఫ్రీ కాంప్లిమెంటరీ పాస్‌ల వివాదం.. అంత ఉత్తదే అంటోన్న హెచ్ సీ ఏ

ఉచిత పాస్‌ల విషయంలో (ఐపీఎల్‌ 2025) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (HCA) మధ్య గొడవలు పతాకస్థాయికి చేరాయి. పాస్‌ల కోసం​ హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు తీవ్రంగా వేధిస్తున్నాడని సన్‌రైజర్స్‌ సంచలన ఆరోపణలు చేసింది.

New Update
sunrisers vs hca

sunrisers vs hca

IPL Matches: ఉచిత పాస్‌ల విషయంలో (ఐపీఎల్‌ 2025) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (HCA) మధ్య గొడవలు పతాకస్థాయికి చేరాయి. పాస్‌ల కోసం​ హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు తీవ్రంగా వేధిస్తున్నాడని సన్‌రైజర్స్‌ మేనేజ్‌మెంట్‌ సంచలన ఆరోపణలు చేసింది. ఇలా చేస్తే హైదరాబాద్‌ నుంచి వెళ్లిపోతామని బెదిరించింది. ఈ అంశానికి సంబంధించి సన్‌రైజర్స్‌ జనరల్‌ మేనేజర్‌ టిబి శ్రీనాథ్‌ హెచ్‌సీఏ కోశాధికారి సీజే శ్రీనివాస్‌ రావుకు ఓ ఘాటు లేఖ రాశారు.

ఇది కూడా చూడండి:UGADI 2025: క్షణాల్లో ఉగాది పచ్చడి రెడీ .. బ్యాచిలర్స్ కూడా తయారు చేసేయొచ్చు!

ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే దివ్యాంగులకు HCA ఉచితంగా కాంప్లిమెంటరీ పాసులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ టికెట్లు తీసుకునేందుకు పేరు, ఫోన్ నెంబర్, వ్యాలిడ్ డిజబులీ ఫ్రూప్, ఏ మ్యాచ్ కోసం పాస్ కావాలి వంటి వివరాలను [email protected] కు ఈ మెయిల్ చేసి దరఖాస్తులు చేసుకోవాలని తెలిపింది.

ఇది కూడా చూడండి:Ugadi 2025 Tv Offers: ఉగాది స్పెషల్.. బ్రాండెడ్ 4k TVలపై బ్లాక్ బస్టర్ ఆఫర్లు- వదిలారో మళ్లీ దొరకవ్!

అయితే ఈ కాంప్లిమెంటరీ పాస్‌ల విషయంలో వివాదంనెలకొంది. ఈ పాస్‌ల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) వేధింపులకు పాల్పడుతోందని సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫాంచైజీ ఆరోపించింది. ఉచిత పాస్‌ల కోసం తమపై తీవ్ర ఒత్తిడి చేస్తోందని ఏసీఏ అసోసియేషన్ కోశాధికారికి సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రతినిధి లేఖ రాశారు. హెచ్‌సీఏ‌కు కోరినన్ని పాసులు ఇవ్వనందుకు ఇటీవల కార్పొరేట్ బాక్స్‌కు తాళాలు వేశారని తెలిపారు. టికెట్ల వ్యవహారంలో HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు చాలాసార్లు బెదిరించారని, ఇలాగే వేధింపులు కొనసాగితే హైదరాబాద్‌ను వదిలి వెళ్లిపోతామని హెచ్చరించారు. సమస్యకు త్వరగా పరిష్కారం చూపాలని లేఖలో కోరారు. దీంతో ఈ వివాదం సంచలనంగా మారింది.


 ఉచిత పాస్‌ల కోసం హెచ్‌సీఏ ఉన్నతాధికారులు, ముఖ్యంగా అధ్యక్షుడు ఏ జగన్‌మోహన్ రావు వేధింపులు తీవ్రమయ్యాయి. ఇలాంటి ప్రవర్తనను మేము ఏమాత్రం సహించం. ఇలాగే కొనసాగితే మేము వేదికను మార్చుకునేందుకు కూడా వెనకాడము. వారి ప్రవర్తన చూస్తే మేము ఉప్పల్‌ స్టేడియంను హోం గ్రౌండ్‌గా ఎంచుకుని మ్యాచ్‌లు ఆడటం వారికి ఇష్టం లేనట్లుంది. ఇలా అయితే లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరుతున్నాను. తద్వారా ఈ విషయాన్ని బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం మరియు మా యాజమాన్యానికి తెలియజేయగలము. మీకు ఇష్టం లేకపోతే మీరు కోరుకున్నట్లే హైదారబాద్‌ నుంచి తరలిపోతామని సన్‌రైజర్స్‌ ప్రతినిథి హెచ్‌సీఏ కోశాధికారికి రాసిన ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు.  

Also Read: Transgenders: డబ్బులు అడిగితే ఇవ్వలేదని.. ట్రైన్‌లో యువకుడిని తొక్కి చంపిన హిజ్రాలు

సన్‌రైజర్స్‌ జనరల్‌ మేనేజర్‌ టిబి శ్రీనాథ్‌ ఈ విషయాలను కూడా తన ఈ-మెయిల్‌లో రాశారు. గత 12 సంవత్సరాలుగా హెచ్‌సీఏతో కలిసి పనిచేస్తున్నాము. గత సీజన్ నుండి మాత్రమే ఈ సమస్యలు, వేధింపులు ఎదుర్కొంటున్నాము. ముందుగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా వారికి  ప్రతి సీజన్‌లో 50 కాంప్లిమెంటరీ టికెట్లు (F12A బాక్స్) ఇస్తున్నాము. ఈ ఏడాది వారు అదనంగా మరో 20 టికెట్లు అడుతున్నారు. ఈ విషయం మా దృష్టికి వచ్చినప్పుడు పరస్పరం చర్చించి స్నేహపూర్వక పరిష్కారానికి వస్తామని వారికి తెలియజేసాము.

Also Read: Hyderabad: మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్యహత్య కేసులో కొత్త మలుపు..భర్త వల్లనే..

అయితే ఈ వివాదంపై హెచ్‌సీఏ అధ్యక్ష కార్యాలయం సిబ్బంది స్పందించింది. SRH, HCA మధ్య ఎలాంటి వివాదం లేదని తెలిపింది. హెచ్‌సీఏ ప్రతిష్టను దిగజార్చేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారని, నకిలీ ఈ మెయిల్స్‌తో దుష్ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేసింది.

Also Read: Ap Weather Report: నేడు 126 మండలాల్లో తీవ్ర వడగాలులు...హెచ్చరికలు జారీ !

Also Read: 🔴Live News Updates: ఈ సారి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం.. దాని అర్థం.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

Advertisment
తాజా కథనాలు