Delhi Student: ఢిల్లీ మెట్రో నుంచి దూకిన బాలుడు..టీచరే కారణమని నోట్

ఢిల్లీ మెట్రో స్టేషన్ నుంచి దూకి ఓ పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తాను చదువుతున్న స్కూలు ప్రిన్సిపల్, ముగ్గురు టీచర్లు మానసికంగా వేధించడం వల్లనే బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి ఆరోపిస్తున్నారు.

New Update
delhi student

ఢిల్లీ ప్రముఖ ఓ పాఠశాలలో చదువుతున్న ఓ పదవ తరగతి విద్యార్థి మెట్రో స్టేషన్లో ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు స్కూల్ ప్రిన్సిపల్, టీచర్లే కారణమని బాలుడు సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుర్రాడి తండ్రి సదరు స్కూల్ పై కేసు నమోదు చేశాడు. బాలుడు రాసిన సూసైడ్ నోట్ లో సారీ మమ్మీ, ఆప్కా ఇట్నీ బార్ దిల్ తోడా, అబ్ లాస్ట్ బార్ తోడుంగా. స్కూల్ కి టీచర్స్ అబ్ హై హి ఐసే, క్యా బోలు అంటూ రాశాడు. స్కూల్లో తనను టీచర్లు రోజు వేధించే వారని చెప్పుకొచ్చాడు. 

మెట్రోస్టేషన్లో ఆత్మహత్య..

బాలుడి తండ్రి చెప్పిన ప్రకారం...తన కొడుకు ఉదయం 7.15 గంటలకు ఇంటి నుంచి బయలుదేరాడని..ఢిల్లీలోని రాజేంద్ర ప్లేస్ మెట్రో స్టేషన్ ద్గర ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. తనకు మధ్యాహ్నం 2జ45 కాల్ వచ్చిందని చెప్పారు. తన కొడుకు ఆసుపత్రిలో జాయిన్ చేసినప్పటికీ ప్రాణాలతో మిగల్లేదని తెలిపారు. మెట్రోస్టేషన్లోని ఎలివేటెడ్ ప్లాట్ పారమ్ పై నుంచి తన పిల్లాడు దూకాడని చెప్పారు.  గత నాలుగు రోజులుగా బాబుని టీచర్లు వేధిస్తున్ానరని..స్కూల్ నుంచి బయటకు పంపించేస్తామని బెదిరించారని చెప్పారు. అంతేకాదు మరో టీచర్ కొట్టారని కూడా చెప్పారు. ఇదంతా ప్రిన్సిపల్ చూసినా కూడా ఏమీ అనలేదని ఆరోపించారు. తన కొడుకు గతంలో కూడా స్కూల్ టీచర్ల గురించితెలిపాడని...తాము పాఠశాలకు వెళ్ళి మాట్లాడామని...అయినా ఫలితం లేదని తండ్రి చెప్పుకొచ్చారు. 

ఆత్మహత్య చేసుకోవడం తప్పని తెలిసినా..తనకు ఇంకో మార్గం లేదని బాలుడు సూసైడ్ నోట్ లో రాశాడు. చనిపోయాక తన అవయవాలు పనిచేసే స్థితిలో ఉంటే దానం చేయాలని కోరాడు. స్కూల్ ప్రిన్సిపల్, టీచర్లపై చర్య తీసుకోవాలని కోరాడు. తనలాగ మరే ఇతర పిల్లలకు కాకూడదని కోరుకున్నాడు. దాంతోపాటూ తానొక మంచి మనిషి కాలేకపోయినందుకు తన అన్నయ్యకు, తండ్రికి క్షమాపనలు చెప్పాడు. 

Also Read: GAZA: గాజాపై ఇజ్రాయెల్ మళ్ళీ దాడులు..28 మంది మృతి

Advertisment
తాజా కథనాలు