Bandi Sanjay : సోనియా గాంధీ రూ.2 వేల కోట్లు కాజేసేది : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత సోనియాగాంధీపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనియా దాదాపు రూ.2 వేల కోట్ల ప్రభుత్వ సంపదను కాజేసే ప్రయత్నం చేసారంటూ కామెంట్స్ చేశారు. దేశ సంపదను దోచుకునేందుకు సిద్ధమైయిందన్నారు.

New Update
National Herald

National Herald

National Herald Case : నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీపై బీజేపీ కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనియా దాదాపు రూ.2 వేల కోట్ల ప్రభుత్వ సంపదను కాజేసే ప్రయత్నం చేసారంటూ హాట్ కామెంట్స్ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసు లో కాంగ్రెస్ దేశ సంపదను దోచుకునేందుకు సిద్ధం అయిందన్నారు. ఈ కేసు బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటిది కాదని, 2011లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే సీబీఐ దర్యాప్తు మొదలైందని గుర్తు చేశారు. ఆ సమయంలోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ కేసులో బెయిల్ పొందారని తెలిపారు.

Also Read :  కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు ఏపీ వాసుల దుర్మరణం!
 
అంతేకానీ ఇది బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టిన కేసులా కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారన్నారు. ఈ కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ దేశ చట్టాలు సోనియాకు, రాహుల్ కు వర్తించవా అంటూ ఆయన ప్రశ్నించారు. తప్పు చేసిన వారు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారని.. న్యాయస్థానాలపై ప్రజలకు నమ్మకం ఉండటం లేదని వెల్లడించారు. ఇటీవల నేషనల్ హెరాల్డ్ కేసుపై కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే.  

Also read: Lady Don: హాట్ టాపిక్‌గా లేడీ డాన్ జిక్రా.. ఏకంగా ఢిల్లీ సీఎం వార్నింగ్

మరోవైపు రేవంత్ సర్కార్‌పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. త్వరలోనే బెంగాల్ తరహా పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నాయని బాంబు పేల్చారు బండి సంజయ్. ఇవాళ తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ఆఫీస్ లో బండి సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రభుత్వ సహకారంతో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతాయన్నారు. ఇది కంట్రోల్ తప్పితే శాంతి భద్రత సమస్యలు తలెత్తుతాయని వార్నింగ్ ఇచ్చారు బండి సంజయ్.

Also Read: Trump: ఇటలీ ప్రధాని మెలోని అంటే నాకు చాలా ఇష్టమంటున్న పెద్దన్న!
  
అటు నేషనల్ హెరాల్డ్ కేసు ఇష్యూపై కాంగ్రెస్ పార్టీ చేసిన ధర్నా మీద బండి సంజయ్ సెటైర్లు వేశారు. అదొక బూతు ధర్నా.. బూతు మాటలు తప్ప అందులో సాధించిందేమీ లేదని చురకలు అంటించారు. దాన వీర శూర కర్ణలో అన్ని పాత్రలు ఎన్టీఆర్ ఒక్కరే పోషించినట్టు.. కాంగ్రెసోళ్లు కూడా హీరోలు, విలన్లు, బ్రోకర్లు, జోకర్లంటూ చురకలు అంటించారు కేంద్ర మంత్రి బండి సంజయ్.ఇక అటు బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. బండి సంజయ్ మాట్లాడేటప్పుడు కేంద్ర మంత్రి అనే విషయం కూడా మర్చిపోతాడు.. పూనకంలో ఏం మాట్లాడుతాడో కూడా ఆయనకే తెలియదని చురకలు అంటించారు మహేష్ కుమార్ గౌడ్.

Also read: Lady Don: హాట్ టాపిక్‌గా లేడీ డాన్ జిక్రా.. ఏకంగా ఢిల్లీ సీఎం వార్నింగ్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు