/rtv/media/media_files/2025/02/10/J1ZbjwwFl6B2EojN4PBL.jpg)
Sonia Gandhi demands govt to conduct population census at earliest
దేశంలో జనగణన ఎప్పుడు జరుగుతుందో అనే అంశం ఇంకా ప్రశ్నార్థకంగానే మారింది. ఈసారి బడ్జెట్‌లో కూడా జనగణన కోసం ఎక్కువ నిధులు కేటాయించకపోవడంతో ఈ ఏడాది కూడా జనగణన లేనట్లే అనే ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ అంశాన్ని రాజ్యసభలో ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా జనగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. దేశంలో 140 కోట్ల మందికి తాము జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని (NFSA) తీసుకొచ్చామని.. జనగణన లేకపోవడం వల్ల 14 కోట్ల మంది ప్రజలు దీని ప్రయోజనాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు.
Also Read: కష్టాన్ని ఇష్టంగా చేసుకోండి.. విద్యార్థులతో ప్రధాని ఇంట్రెస్టింగ్ చిట్ చాట్
2011 జనాభా లెక్కలనే ఇప్పటికీ పరిగణనలోకి తీసుకోవడం వల్ల ఇలా జరుగుతోందని ఆరోపించారు. " 2013 సెప్టెంబర్‌లో తాము రూపొందించిన NFSA చట్టం 140 కోట్ల జనాభకు పోషకాహార భద్రత అందించడంలో మైలురాయిగా మారింది. కరోనా సమయంలో ఈ చట్టం వల్ల లక్షలాది కుటుంబాలకు కడుపు నింపింది. త్వరగా జనగణన చేస్తే NFSA కింద ఎంతోమంది ప్రజలు లబ్ది పొందుతారు.
Also Read: ఏకంగా బౌన్సర్లను పెట్టి మరీ గెంటెస్తున్న టెక్ కంపెనీలు
ఎన్డీయే పాలనలో జనాభా గణన నాలుగేళ్లకు పైగా ఆలస్యమయ్యింది. 2021లోనే జనగణన నిర్వహించాల్సి ఉండగా.. కేంద్రం దాన్ని విస్మరించింది. మళ్లీ ఎప్పుడు చేపడతారనేదానిపై స్పష్టత లేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం జాతీయ ఆహార భద్రతా చట్టం వల్ల దాదాపు 81.85 కోట్ల మంది లబ్ది పొందారు. గ్రామీణ జనాభాలో 75 శాతం, పట్టణ జనాభాలో 50 శాతం ప్రజలు దీనివల్ల ప్రయోజనం పొందారు. ఈ స్కీమ్ ద్వారా ప్రతి వ్యక్తికి నెలకు 5 కిలోల ఆహార ధాన్యాలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని'' సోనియా గాంధీ అన్నారు.
Also Read: బంగ్లాలో కొనసాగుతున్న ఆపరేషన్ డేవిల్ హంట్..1300 మంది అరెస్ట్!