Viral Video: వామ్మో.. వాయ్యో: ఒక్కసారి ఈ పాము మనుషులకు కాటేస్తే.. పరిస్థితేంటి బ్రో!

సోషల్ మీడియాలో ఓ పాము వీడియో వైరల్ అవుతోంది. ఇంటి గోడల మధ్య చిక్కుకున్న పామును రక్షించేందుకు కొందరు ప్రయత్నించారు. చెప్పుతో ఆ పామును బయటకు పంపాలనుకున్నారు. కానీ ఆ పాము తన కోరలతో చెప్పును కాటేసింది. అక్కడే విషాన్ని వదలడంతో స్థానికులు ఖంగుతిన్నారు.

New Update
snake viral video

snake viral video

పాములంటే అందరికీ భయమే. వాటిని చూశారంటే పరుగులు పెడతారు. వామ్మో.. వాయ్యో అంటూ వణికిపోతుంటారు. కానీ పాములకు సంబంధించిన వీడియోలు మాత్రం చూసేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. వాటికి సంబంధించిన వీడియోలు సైతం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. వేలల్లో వ్యూస్, లక్షల్లో లైక్స్‌తో పాములకు సంబంధించిన వీడియోలు తరచూ చక్కర్లు కొడుతుంటాయి. 

Also Read: ముఖ్యమంత్రి చంద్రబాబు- నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ మధ్య ఆసక్తికర చర్చ ..

విషపూరితమైన పాము

తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాగుపాము గురించి అందరికీ తెలిసిందేగా. అత్యంత విషపూరితమైన పాముల్లో నాగుపాము కూడా ఒకటి. కాటు వేస్తే కాటికి పోవాల్సిందే. అలాంటి పాము వీడియో ఇప్పుడు వైరల్‌గా మారడంతో అది చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 

Also Read: సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలపై బిగ్ అప్డేట్.. ఫిబ్రవరి 15 లోగా పూర్తి చేయాలని ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు

ఆ పాము కోపాన్ని చూసి ఖంగుతింటున్నారు. ఆ సమయంలో మనిషిని ఊహించుకుంటే పరిస్థితి ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఇంతకీ ఏమైంది.. ఆ వీడియోలో అంతలా ఏముంది అనే విషయానికొస్తే.. ఒక ఇంటి బయట గోడల మధ్యలో నాగుపాము ఇరుక్కుంది. 

Also Read: విజయసాయికి కేతిరెడ్డి కౌంటర్.. ఆ విషయం అందరికీ తెలుసంటూ సంచలన ట్వీట్!

చెప్పును కాటేసి

దీంతో అది గమనించిన స్థానికులు దాన్ని బయటకు పంపాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో వారు చేసిన పని ఆ పాముకు తీవ్ర కోపాన్ని తెచ్చింది. దీంతో ఆ పామును బయటకు పంపే సందర్భంలో ఒక చెప్పుతో దాన్ని కొట్టారు. వెంటనే ఆ పాము ఆ చెప్పును కాటేసింది.

తన కోరలతో చెప్పును గట్టిగా పట్టుకుంది. అప్పుడే తన కోరలనుంచి విషాన్ని వెదజిమ్మింది. ఆ విషాన్ని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ విషం చెప్పుకు కాకుండా.. మనుషుల శరీరంలోకి వెళితే వారి పరిస్థితి ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు