Delhi: ఇంకా రాజధానిగా ఢిల్లీ అవసరమా..?

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారిపోగా.. ఇక్కడ ప్రమాదకర కాలుష్య కారకాలు నాలుగు రెట్లు పెరిగినట్లు ఎంపీ శశి థరూర్‌ అన్నారు. ఇలాంటి పరిణామాల మధ్య ఇంకా ఢిల్లీని దేశ రాజధానిగా కొనసాగించాలా? అని ఎంపీ ఎక్స్ లో రాసుకొచ్చారు.

sasi
New Update

 దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం క్రమంలో పెరిగిపోతుంది. దీనికి తోడు పొగ మంచు కప్పేయడంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అత్యంత తీవ్ర స్థాయికి పడిపోయినట్లు సమాచారం. ఈ రోజు  ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ 500 మార్క్ ను తాకింది. దీనిపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీని దేశ రాజధానిగా కొనసాగాల్సి ఉందా అని క్వశ్చన్ చేశారు. 

Also Read:  AP: ఏపీలో ఆ ఉద్యోగులందరూ తొలగింపు..సర్కార్‌ కీలక నిర్ణయం!

అయితే, కాలుష్య నగరాల జాబితా గణాంకాలకు సంబంధించి ఓ టేబుల్‌ను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ విడుదల చేశారు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారిపోగా.. ఇక్కడ ప్రమాదకర కాలుష్య కారకాలు నాలుగు రెట్లు పెరిగినట్లు ఎంపీ అన్నారు. అలాగే, రెండో అత్యంత కాలుష్య నగరం ఢాకా ( బంగ్లాదేశ్ రాజధాని ) పోలిస్తే ఢిల్లీలో ప్రమాద స్థాయి 5 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు ఆయన ఆరోపించారు. ఇలాంటి విపత్కర పరిస్థితిని మనం గత కొన్నేళ్లుగా చూస్తున్నాం.

Also Read : Sabarimala: శబరిమలకు పోటెత్తిన స్వాములు..దర్శనానికి 10 గంటల సమయం!

 దీనిపై కేంద్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదు అని పోస్ట్ చేశారు. నవంబర్ నుంచి జనవరి మధ్య ఈ నగరం నివాసయోగ్యంగానే ఉండటం లేదని విమర్శించారు. మిగతా సమయాల్లోనూ అంతంత మాత్రంగానే జీవనం కొనసాగించగలం అని చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిణామాల మధ్య ఇంకా ఢిల్లీని దేశ రాజధానిగా కొనసాగించాలా? అని ఎంపీ శశిథరూర్ ఎక్స్ (ట్విట్టర్)లో రాసుకొచ్చారు.

Also Read: Kcr: కాళేశ్వరంపై కేసీఆర్, హరీశ్ కు బిగ్ షాక్.. విచారణకు రంగం సిద్ధం!

డేంజర్ జోన్‌లో దేశ రాజధాని...

దేశ రాజధాని ఢిల్లీ ప్రస్తుతం డేంజర్ జోన్‌లో ఉంది. ఢిల్లీలో రోజురోజుకి గాలి నాణ్యత పడిపోతుంది. ఈ రోజు ఎయిర్‌ క్వాలిటీ సివియర్ ప్లస్ కేటగిరీలోకి పడిపోయింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. గతంలో ప్రాథమిక విద్యార్థుల స్కూళ్లు మూసివేయగా.. ఇప్పుడు 10, 12 వ తరగతి విద్యార్థులకు కూడా సెలవులు ప్రకటించింది. మళ్లీ ఆదేశాలు జారీ చేసే వరకు ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహించాలని సీఎం అతిశీ ఆదేశించారు.

Also Read: Pawan: పవన్ కు భారీ ఊరట.. క్రిమినల్ కేసులో ...కోర్టు కీలక ఆదేశాలు!

ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్..


ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ప్రకటించారు. కూల్చివేతలు, నిర్మాణ పనులను ఆపివేయాలని ఆదేశించారు. అలాగే అవసరం లేని భారీ వాహనాలను కూడా సిటీలో నిషేధం విధించారు. కొన్ని ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచీ 1000 కంటే ఎక్కువగా ఉంది. అధిక కాలుష్యం వల్ల ఢిల్లీ ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కాలుష్యా్న్ని నియంత్రించేందుకు కూడా ప్రభుత్ం ప్రయత్నిస్తోంది. 

ఇదిలా ఉండగా ఇటీవల ప్రభుత్వ కార్యాలయాల్లో పనివేళలను కూడా మార్చారు. ఢిల్లీ మున్సిపాలిటీ పరిధిలోని కార్యాలయాలు ఉదయం 8.30 నుంచి 5 గంటల వరకు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 వరకు, దిల్లీ ప్రభుత్వ ఆఫీసులు ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పనిచేయాలని సీఎం అతిశీ ఆదేశించారు.

అలాగే వాయు కాలుష్యం పెరిగిపోతున్న కారణం వల్ల అవసరం లేని నిర్మాణాలు చేపట్టకూడదని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే కూల్చివేతలపై కూడా నిషేధం విధించింది. వీటితో పాటు బీఎస్‌-3 పెట్రోల్, బీఎస్‌-4 డీజిల్‌ వాహనాల ప్రయాణాలను నిషేధించాయి. త్వరలో 106 క్లస్టర్ బస్సులు,  మెట్రో సేవలను కూడా మరింత పెంచుతామని ప్రభుత్వం తెలిపింది. 

#delhi #shashi-tharoor #delhi-air-pollution #air-quality-index
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe