Kcr: కాళేశ్వరంపై కేసీఆర్, హరీశ్ కు బిగ్ షాక్.. విచారణకు రంగం సిద్ధం!

కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారణకు పిలవనుంది. వీరిద్దరినీ ఈ నెలాఖరున లేదా డిసెంబరు తొలివారం లో విచారించే అవకాశాలు కనపడుతున్నాయి.

New Update
hari

తెలంగాణ

Kcr: కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ , అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారణకు పిలవనున్నట్లు తెలుస్తుంది. వీరిద్దరినీ ఈ నెలాఖరున లేదా డిసెంబరు తొలివారం లో విచారించే అవకాశాలు కనపడుతున్నాయి. 21న హైదరాబాద్‌ రానున్న జస్టిస్‌ ఘోష్‌.. వచ్చే నెల 5 దాకా ఇక్కడే ఉండనున్నారు. మాజీ సీఎస్‌లు ఎస్‌కే జోషి, సోమేష్‌ కుమార్‌, మాజీ ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌, సీఎంవో మాజీ ఓఎస్డీ, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలించిన స్మితా సభర్వాల్‌, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును తొలుత కమిషన్‌ క్రాస్‌ ఎగ్జామిన్‌ చేయనుంది. 

Also Read: TG Ration Card: తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న వారికి బిగ్ షాక్!

ప్రాజెక్టు నిర్మాణంలో కీలక నిర్ణయాలు తీసుకున్నది ఎవరు? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బ్యారేజీలు కట్టాలని నిర్ణయించిందెవరు?బ్యారేజీల వైఫల్యానికి కారణాలు ఏంటి? రీ ఇంజనీరింగ్‌తో కాళేశ్వరం ప్రాజెక్టును తెరమీదికి తేవడానికి కారణమేంటి? వంటి వివరాలను కమిషన్‌ సేకరించే అవకాశాలున్నాయి. అనంతరం కేసీఆర్‌, హరీశ్‌రావుకు కమిషన్‌ సమన్లు పంపే అవకాశాలున్నాయి. అయితే, విచారణకు కేసీఆర్‌ హాజవు అవుతారా? లేక జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి కమిషన్‌కు లేఖ రాసినట్లుగా.. జస్టిస్‌ పీసీ ఘోష్‌కు లేఖ రాసి దూరంగా ఉంటారా? అన్న చర్చ సాగుతోంది. 

Also Read: BIG BREAKING: నిజామాబాద్‌లో హైటెన్షన్.. మేయర్ భర్తపై సుత్తెతో దాడి!

జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి స్థానంలో నియమితులైన జస్టిస్‌ మదన్‌ భీంరావు లోకూర్‌ కమిషన్‌ మాత్రం కేసీఆర్‌ను విచారణకు పిలవకుండానే నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఇప్పుడు కూడా కేసీఆర్‌ విచారణకు రాకపోతే... ఆయన ఇచ్చే లేఖనే అభిప్రాయంగా పరిగణనలోకి తీసుకొని కాళేశ్వరం విచారణ నివేదిక ఇచ్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. 

Also Read: Pawan: పవన్ కు భారీ ఊరట.. క్రిమినల్ కేసులో ...కోర్టు కీలక ఆదేశాలు!

డిసెంబరు నెలాఖరు లేదా వచ్చే జనవరి ఆఖరుకల్లా ప్రభుత్వానికి నివేదిక అందించడానికి జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. డిసెంబరు 5 కల్లా విచారణ పూర్తయితే... నివేదికను తయారు చేసే ప్రక్రియను కమిషన్‌ మొదలుపెట్టనుంది.

Also Raed: TG Ration Card: తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న వారికి బిగ్ షాక్!

Advertisment
తాజా కథనాలు