AP: ఏపీలో ఆ ఉద్యోగులందరూ తొలగింపు..సర్కార్ కీలక నిర్ణయం! ఏపీ ప్రభుత్వం ఏకంగా 95మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలో.. గత ప్రభుత్వ హయాంలో 95మందిని మంత్రులు, ఎంపీల సిఫార్సులతో ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. వీరిలో 50మంది కాంట్రాక్ట్, 45మందని ఔట్ సోర్సింగ్ కింద తీసుకున్నారు. By Bhavana 19 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి AP GOVT: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయ నేతల సిఫార్సులతో ఏపీఎండీసీ (ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ)లో ఎడాపెడా ఉద్యోగాలు ఇచ్చారనే విమర్శలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు సిఫార్సులతో ఉద్యోగాలు పొందిన వారికి ఆ శాఖ ఎండీ చెక్ పెట్టారు. పొరుగుసేవల కింద పనిచేస్తున్న 45 మంది సిబ్బందిని.. అంతేకాదు కాంట్రాక్టు విధానంలో తీసుకున్నమరో 50 మందిని కూడా విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు ప్రభుత్వం మొత్తం 95 మంది పొరుగుసేవలు, కాంట్రాక్టు ఉద్యోగుల తొలగించారు. Also Read: TG Ration Card: తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న వారికి బిగ్ షాక్! 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సిఫార్సులతో వీరిని ఉద్యోగాల్లోకి తీసుకున్నట్లు కూటమి ప్రభుత్వం తెలిపింది. వీరితో పాటుగా వివిధ శాఖల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే సిఫార్సులతో ఏపీఎండీసీలో అవసరం లేకపోయినా వందల సంఖ్యలో ఉద్యోగులను నియమించినట్లు ఆరోపణలు అయితే వచ్చాయి. ఈ 95మందికి ఐదేళ్లపాటు జీతాలు చెల్లించడంతో ఏపీఎండీసీపై అదనపు భారం పడింది. Also Read: Kcr: కాళేశ్వరంపై కేసీఆర్, హరీశ్ కు బిగ్ షాక్.. విచారణకు రంగం సిద్ధం! కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరి వివరాలపై ఆరా తీశారు. ఆ వెంటనే వీరికి చెక్ పెట్టడం ప్రారంభించారు. ఈ ఉద్యోగుల కాంట్రాక్టు కాలం జూన్ తర్వాత నుంచి ముగిసినా.. వారి కాంట్రాక్టు ని తిరిగి పొడిగించలేదు. ఈ మేరకు అలా దాదాపు 150 మంది ఉద్యోగులు బయటకు వెళ్లిపోయారు. గడువున్న ఉద్యోగుల్లో 65 మందిని కూడా తాజాగా తొలగించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఈ 95మందిని తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం సంచలనంగా మారింది.మరోవైపు ఏపీ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ (ఏపీఐటీఏ)ని రద్దు చేసింది. Also Read: Sabarimala: శబరిమలకు పోటెత్తిన స్వాములు..దర్శనానికి 10 గంటల సమయం! Also Read: Pawan: పవన్ కు భారీ ఊరట.. క్రిమినల్ కేసులో ...కోర్టు కీలక ఆదేశాలు! #apmdc employs #Out sourcing employees #apmdc outsourcing employees terminated మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి