/rtv/media/media_files/2025/10/11/reliance-group-chairman-2025-10-11-11-26-43.jpg)
Reliance Group Chairman
Anil Ambani : రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ సహాయకుడు, రిలయన్స్ పవర్ లిమిటెడ్ సీనియర్ అధికారి అశోక్ కుమార్ పాల్‌ను శనివారం రూ. 17,000 కోట్ల విలువైన బ్యాంకు రుణ మోసాలకు సంబంధించిన కేసులో ఈ డీ అధికారులు అరెస్టు చేశారు. బ్యాంకులకు కోట్లు ఎగవేసిన కేసులో అనిల్ అంబానీకి చెందిన కంపెనీలపై ఈడీ దర్యాప్తు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) నిబంధనల కింద పాల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పాల్ 25 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్, ఏడు సంవత్సరాలకు పైగా రిలయన్స్ పవర్‌లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.
ఇది కూడా చూడండి: Illegal Betting Case : కాంగ్రెస్ ఎమ్మెల్యేపై ఈడీ దాడులు...కోట్లాది డబ్బు..కిలోలకొద్ది బంగారం..
పాల్2017 -2019 మధ్య అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు ఎస్ బ్యాంక్ ఇచ్చిన దాదాపు రూ. 3,000 కోట్ల "అక్రమ" రుణ మళ్లింపుకు సంబంధించి ఆయనపై ఆరోపణలు రాగా. రెండో ఆరోపణలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ రెండింటిలో రూ. 17,000 కోట్లకు పైగా మోసం జరిగినట్లు అరోపణలు ఉన్నాయి. బలహీనమైన ఆర్థిక వనరులు కలిగిన కంపెనీలకు రుణాలు జారీ చేయడం, సాధారణ డైరెక్టర్లు, చిరునామాలను ఉపయోగించడం, అవసరమైన డాక్యుమెంటేషన్ లేకపోవడం, షెల్ సంస్థలకు నిధుల మళ్లింపు వంటివి జరిగినట్లు ఈడీ నిర్ధారించింది. ఈ మేరకు ఆయనను అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించింది.
ఇది కూడా చూడండి: Sad news : పంజాబీ నటుడు, బాడీ బిల్డర్ వీరేందర్ గుహ్‌మన్ మృతి...శోక సముద్రంలో పంజాబ్
మనీలాండరింగ్ కేసులో భాగంగా, రిలయన్స్ కంపెనీలు కోట్లాది రూపాయల ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాయనే ఆరోపణలతో ఈడీ ఈ సంవత్సరం జూలైలో దాడులు ప్రారంభించింది. ఈ కేసులో మొదటి అరెస్టు ఆగస్టులో జరిగింది. బిస్వాల్ ట్రేడ్‌లింక్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పార్థ సారథి బిస్వాల్ ను రూ. 68.2 కోట్ల విలువైన నకిలీ పత్రాలను రిలయన్స్ పవర్ తరపున ఇచ్చినట్లు వారు తెలిపారు. బ్యాంకు మోసం కేసులపై అనిల్ అంబానీ గ్రూప్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది.
గత కొన్ని రోజులుగా, దర్యాప్తు సంస్థ అనిల్ అంబానీని విచారణకు పిలిచింది. రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్‌లకు రుణాలు మంజూరు చేసినప్పుడు నిర్వహించిన డ్యూ డిలిజెన్స్ విధానాల గురించి 12 నుండి 13 బ్యాంకుల నుండి వివరాలను కోరింది. 2017 నుంచి 2019 మధ్య కాలంలో యెస్ బ్యాంకు నుంచి మూడు వేల కోట్లు రుణం తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ సొమ్మును డైవర్ట్ చేశారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సుమారు 68.2 కోట్ల ఫేక్ బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చినట్లు ఈడీ ఆరోపిస్తుంది.
Also Read: Rashmika: రష్మిక చేతికి పెద్ద డైమండ్ ఉంగరం..ఎంగేజ్ మెంట్ నిజమే అంటున్న అభిమానులు