Rashmika: రష్మిక చేతికి పెద్ద డైమండ్ ఉంగరం..ఎంగేజ్ మెంట్ నిజమే అంటున్న అభిమానులు

విజయ్, రష్మికలకు ఎంగేజ్ మెంట్ జరిగింది నిజమేనంటున్నారు అభిమానులు. తాజాగా రష్మిక పెట్టిన ఇన్స్టా పోస్ట్ లో ఆమె కుడి చేతి వేలికి పెద్ద డైమండ్ రింగ్ కనిపించడమే దీనికి నిదర్శనమని చెబుతున్నారు. 

New Update
rasmika

విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నాకు ఎంగేజ్ మెంట్ అయిందనే వార్తలు వచ్చాయి. హైదరాబాద్ లోని విజయ్ ఇంట్లో చాలా కొద్ది మంది బంధువుల మధ్యలో వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారని సమాచారం వచ్చింది. 
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరిద్దరూ ఒక ఫేమస్ డెస్టినేషన్ లో పెళ్ళి చేసుకుంటారని చెప్పారు. ఇంతవరకే అందరికీ తెలుసు. అయితే అధికారికంగా ఈ విషయాన్ని ఎవరూ కన్ఫార్మ్ చేయలేదు. విజయ్, రష్మికాలు కూడా ఎక్కడా దీనిపై మాట్లడలేదు. కనీసం నిజం కాదు అని ఖండించలేదు కూడా. ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు. దీంతో ఎంగేజ్ మెంట్ విషయం నిజమా కాదా అనే అనుమానం చాలా మందికి వచ్చింది. 

ఎందుకంటే విజయ్ , రష్మికలు ఎ్పటి నుంచో డేటింగ్ లో ఉన్నారనే రూమర్లు ఉన్నాయి. అయితే ఈ విషయంపై హీరో హీరోయిన్లు ఇద్దరూ ఎక్కడా స్పందించలేదు. లేము అని కూడా చెప్పలేదు. ఇంకా రష్మికానే విజయ్ తనకు మంచి స్నేహితుడని చాలాసార్లు చెప్పింది కానీ విజయ్ అది కూడా చెప్పలేదు. కానీ ఇద్దరూ కలసి తిరుగుతున్నారు అన్నట్టు ఫోటోలు బయటపడ్డాయి. ఇలాగే ఎంగేజ్ మెంట్ తర్వాత కూడా ఇద్దరూ స్పందించకపోవడంతో అభిమానులకు అనుమానం వచ్చింది. 

వేలికి పెద్ద డైమండ్ రింగ్..

అయితే రష్మిక రీసెంట్ గా ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ తో ఈ అనుమానాలన్నింటికీ చెక్ పెట్టినట్టు అయింది. ఇందులో రష్మిక తన కుక్కతో ఆడుకుంటూ వీడియో పెట్టింది. ఆ వీడియోలో రష్మిక చేతికి పెద్ద డైమండ్ ఉంగరం కనిపించింది. అంతకు ముందు అది ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు కొత్తగా రష్మి చేతికి ఉంగరం కనిపించడంతో ఎంగేజ్ మెంట్ జరిగిన విషయం నిజమేనంటూ అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. తమ అభిమాన హీరోహీరోయిన్లు నిజంగానే ఒక్కటవుతున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

AlsoRead: Rohith Sharma: జోరుగా రోహిత్ ప్రాక్టీస్...దెబ్బకు లంబోర్గిని కారు అద్దాలు బద్దలు 

#Vijay Devarakonda #heroine rashmika mandanna viral video #today-latest-news-in-telugu
Advertisment
తాజా కథనాలు